Hair Tips: నల్లటి పొడవాటి జుట్టు కావాలంటే.. ఈ విషయాలను ఫాలో అవ్వాల్సిందే?

మామూలుగా స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా నల్లటి పొడవాటి జుట్టు కావాలని కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుత రోజుల్లో అనేక రకాల కారణాల వల్ల ఆ జుట్టుకు స

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 02:30 PM IST

మామూలుగా స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా నల్లటి పొడవాటి జుట్టు కావాలని కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుత రోజుల్లో అనేక రకాల కారణాల వల్ల ఆ జుట్టుకు సంబంధించిన చాలా సమస్యలతో బాధపడుతున్నారు. తెల్ల జుట్టు రావడం చుండ్రు హెయిర్ ఫాల్ ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు స్త్రీలకు జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటే మరికొందరికి పలుచగా తెల్లని వెంట్రుకలు వచ్చి ఉంటాయి. అటువంటి వారు నల్లని ఒత్తైన జుట్టు కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే నల్లటి పొడవాటి జుట్టు మీకు కూడా కావాలి అంటే కొన్ని రకాల విషయాలను ఫాలో అవ్వాల్సిందే. ఎటువంటి విషయాలను ఫాలో అవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మనం చక్కటి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే జుట్టు కూడా అంత చక్కగా పెరుగుతూ ఉంటుంది. జుట్టు శుభ్రం చేసుకుంటూ ఉంటే ఒక్కసారి పుట్టిన వెంట్రుక ఐదు సంవత్సరాల వరకు ఊడిపోకుండా పెరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఉడిన వెంట్రుక ప్లేస్లో మళ్లీ కొత్త వెంట్రుకలు కూడా పుడుతూ ఉంటాయి. ఈ వెంట్రుక రావడానికి 20 రోజులు సమయం పడుతుంది. అయితే ఔషధ గుణాలు కలిగిన నూనెలు అప్లై చేసుకోవడం వల్ల ఈ కొత్త వెంట్రుకలు 15 రోజుల్లో మళ్ళీ మొలుస్తున్నాయి. ఊడిన వెంట్రుక ప్లేసులో 20 సార్లు కొత్త వెంట్రుకలు మొలుస్తున్నాయి. ఈ 20 సార్లు తర్వాత రాలిన వెంట్రుకల ప్లేస్ లో మళ్లీ వెంట్రుకలు రావు. అనారోగ్య సమస్యలు కారణంగా వెంట్రుకలు రాలినప్పటికీ మన జీవన విధానాన్ని మార్చుకోవడం వలన వాటి ప్లేసులో మళ్ళీ కొత్త జుట్టు వస్తుంది.

అదేవిధంగా రోజుకు 50 నుండి 150 వెంట్రుకలు సహజంగా ఉడిపోతూ ఉంటుంది. చాలామంది వెంట్రుకలు ఊడిపోతే 50 వెంట్రుకలు మళ్లీ వస్తాయి. ఇటువంటి వారు జుట్టు ఒత్తుగా పెరుగుతూ ఉంటుంది. చాలామందిలో 100 వెంట్రుకలు రాలితే పోషకాహార లోపం ఇంప్లమేషన్ మూలంగా తిరిగి 50 వెంట్రుకలు మాత్రమే వస్తాయి. అదేవిధంగా రక్తహీనత, థైరాయిడ్ లాంటి సమస్యలు వలన జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహారాలు శరీరంలో రక్తాన్ని పెంచే ఆహారాలు తీసుకోవడం సోయాబీన్స్, మిల్ మేకర్, ఆకుకూరలు, బాదంపప్పు ఎక్కువగా తీసుకోవడం వలన జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే మందార ఆకులను తీసుకొని వాటిని మెత్తని పేస్టులా చేసుకుని దాని అప్లై చేసుకోవడం వలన కూడా జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే బృంగరాజ్ ఆకుల తైలాన్ని కూడా అప్లై చేసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. కేవలం ఆహార విషయంలో మాత్రమే కాకుండా జుట్టుకు అప్లై చేసే ఆయిల్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి..