Site icon HashtagU Telugu

Hair Tips: జుట్టుకు ఇది పట్టిస్తే చాలు.. తోక లాగా ఉన్న జడ ఒత్తుగా పెరగాల్సిందే?

Mixcollage 22 Dec 2023 06 33 Pm 9790

Mixcollage 22 Dec 2023 06 33 Pm 9790

పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు జుట్టు విషయంలో ఆ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా పొడవాటి జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటుంది. కానీ మనం తినే ఆహార పదార్థాలు అలాగే రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లు అలాగే ఇతర కారణాల వల్ల జుట్టు చిట్లిపోవడం హెయిర్ ఫాల్ కావడం తెల్ల జుట్టు రావడం లాంటి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఒత్తైనా పొడవాటి జుట్టు కోసం చాలామంది ఎన్నో రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. మీరు కూడా అలా ఒత్తైనా పొడవాటి నల్లని జుట్టు కావాలని అనుకుంటున్నారా.

అయితే ఇప్పుడు తెలుసుకోబోయే రెమెడీని పాటిస్తే చాలు తోకలా ఉన్న జుట్టు కూడా పొడవైన జడగా మారాల్సిందే. అందుకోసం ఏం చేయాలంటే.. ఈ చిట్కా తయారు చేసుకోవడానికి మొదటగా ఒక గిన్నె తీసుకొని రెండు చెంచాల మెంతులని వేసుకోవాలి. ఈ మెంతులు జుట్టు రాలడం ఆపి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. మెంతులు జుట్టుని మైశ్చరైజ్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే జుట్టుని మృదువుగా మెరిసేలా చేస్తుంది. తర్వాత దీనిలో లవంగాలు కూడా వేసుకోవాలి. అలాగే దీనిలో 100 ఎంఎల్ వాటర్ ని కూడా వేసి నైట్ మొత్తం నానబెట్టుకొని మరునాడు డైరెక్ట్ గా కూడా ఉపయోగించుకోవచ్చు.

ఒకవేళ సమయం లేకపోతే వీటిని స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు పాటు కాగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపుకొని దీనికోసం మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటితో పాటు లవంగాలు మెంతులతో పాటు ఆ నీటిని కూడా వేసి మిక్సీ వేసుకోవాలి. ఈ వేసుకున్న మిశ్రమాన్ని ఏదైనా కాటన్ క్లాత్లో వేసి మెత్తటి జల్ లాంటి పదార్థాన్ని స్ట్రైనర్ చేసుకోవాలి. దీనిని డ్రై హెయిర్ ఉన్నప్పుడు పెట్టుకొని 45 నిమిషాల వరకు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా గాడత తక్కువ గల షాంపుతో తలస్నానం చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వలన జుట్టు రాలడం ఆగిన జుట్టు పొడవుగా, ఒత్తుగా ఎదుగుతుంది. ఈ విధంగా వారానికి ఒకసారి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను మీరు గమనించవచ్చు.