Site icon HashtagU Telugu

Hair Tips: చలికాలంలో చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే నిమ్మరసంతో ఇలా చేయాల్సిందే?

Mixcollage 22 Dec 2023 04 37 Pm 3088

Mixcollage 22 Dec 2023 04 37 Pm 3088

ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎక్కువ శాతం మంది చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా స్త్రీ, పురుషులు ఇద్దరు చలికాలంలో చుండ్రు సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అయితే ఈ చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల టిప్స్ పాటిస్తూ ఉంటారు. కొందరు హోమ్ రెమెడీస్ ఫాలో అయితే మరికొందరు బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మరి చలికాలంలో ఈ చుండ్రు సమస్య ఉండకూడదంటే అందుకు ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సుండ్రు సమస్య ఉన్నవాళ్లు ఈ నిమ్మకాయని ఉపయోగించాలి. నిమ్మరసం జుట్టులోని దురదను తగ్గిస్తుంది. నిమ్మరసంలో యాంటీ బ్యాక్టీరియాలో యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు చుండ్రుని తగ్గించడంలో సహాయపడతాయి. అలోవెరా జ్యూస్ నిమ్మకాయని రెగ్యులర్ గా ఉపయోగిస్తే చుండ్రు సమస్యలు దూరం అవుతాయి. కలబంద రసం నిమ్మకాయను ఉపయోగించడం వల్ల చుండ్రు తగ్గుతుంది. అయితే ఇందుకోసం మూడు చెంచాల కలబంద రసం తీసుకొని దీనిలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 15 నిమిషాలు వరకు అలాగే ఉంచాలి. దీన్ని ఉపయోగిస్తే మీకు తేడా కనిపిస్తుంది. అలాగే అలీవ్ నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది.

చుండ్రు సమస్యను దూరం చేయడానికి అలీవ్ ఆయిల్ నిమ్మరసం ఉపయోగించవచ్చు. దీన్ని మీరు రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీరు చుండ్రు సమస్యను దూరం చేసుకోవచ్చు. అదేవిధంగా చుండు సమస్య ఉంటే కొబ్బరి నూనె నిమ్మరసం ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకొని దీనిలో నిమ్మరసం వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో తలకు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మీద సుమారు గంట ఉంచాలి.. దీని తర్వాత జుట్టును నీటితో కడగాలి. చుండ్రు కోసం పండిన బొప్పాయి గుజ్జును, శెనగపిండి గుడ్డులోని తెల్ల సోన, నాలుగు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి వేస్ట్ లా తయారు చేసుకొని ఆ పేస్టును తలకు అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయాలి.