Site icon HashtagU Telugu

Hair Tips: షాంపూలో ఇదొక్కటి కలిపి ఉపయోగిస్తే చాలు.. రాలిపోయిన జుట్టు సైతం తిరిగి మొలవడం ఖాయం?

Mixcollage 18 Feb 2024 09 04 Pm 6703

Mixcollage 18 Feb 2024 09 04 Pm 6703

మామూలుగా అమ్మాయిలు పొడవాటి జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో అనేక రకాల కారణాల వల్ల అమ్మాయిలు హెయిర్ ఫాల్ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. అధికంగా హెయిర్ ఫాల్ అవ్వడం, జుట్టు చిట్లిపోవడం, డాండ్రఫ్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటన్నిటి కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు కొన్ని రకాల చిట్కాలను పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే మీరు తరచుగా ఉపయోగించే షాంపుని రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి.

అలాగే అలోవెరా జెల్ ని కూడా తీసుకోవాలి. ఇంట్లో పెంచుకునే వారు ఉంటే గనక ఫ్రెష్ గా ఒక చిన్న ముక్కను కట్ చేసుకుని పై తొక్కుని తీసేసి అందులో ఉన్నటువంటి గుజ్జుని అంతా తీసి రెడీగా పెట్టుకున్న షాంపులో వేసి బాగా మిక్స్ చేసేయాలి. ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ పంచదార పొడిని వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పంచదార అనేది జుట్టులో ఉండిపోయినటువంటి జిడ్డును తొలగించే స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి షాంపూను జుట్టుకు పట్టించి ఐదు నిమిషాల తర్వాత మామూలు నీళ్లతో స్నానం చేసేయవచ్చు. ఇలా వారానికి ఒకసారి ఒక్క నెల రోజులు పాటు ఇలా చేస్తే మంచి ఫలితం మీకే కనబడుతుంది.

హోమ్ రెమెడీని యూస్ చేయడం వలన జుట్టు మృదువుగా మెరుస్తూ ఉంటుంది. జుట్టు రాలడం ఆగిపోవడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చాలామందికి చలికాలంలో చుండ్రు వస్తుంది. సమస్యకి పంచదార ఎంత మొండి చుండ్రుకైనా కూడా అద్భుతంగా పరిష్కారంగా నిలుస్తుంది. వారంలో రెండు సార్లు ఇలా చేస్తుంటే ఎంత మొండి చుండ్రు అయినా కూడా వదిలిపోతుంది. అలాగే మధ్యాహ్నం ఒక గ్లాసుడు క్యారెట్ జ్యూస్ సాయంత్రం ఉసిరి జ్యూస్ తాగాలి. రాత్రి పడుకునే ముందు మునగాకు పౌడర్ను ఒక గ్లాసు మంచినీటిలో వేసుకుని తాగాలి. ఆకుకూరల్లో విటమిన్ ఏ, సి క్యారెట్ పోలిక్ యాసిడ్ పొటాషియం ఉంటాయి. దాల్చిన చెక్క జుట్టు పెరుగుదలను పెంచి మంచి షైనింగ్ ఇస్తుంది.

Exit mobile version