ప్రస్తుత రోజుల్లో హెయిర్ ఫాల్ సమస్య ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ హెయిర్ ఫాల్ సమస్య కారణంగా చాలామంది అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ హెయిర్ ఫాల్ కి అనేక రకాల కారణాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. వాతావరణంలో కాలుష్యం వలన, ఆహార పద్ధతిలో మార్పుల వలన అలాగే పలు కారణాల వలన జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అంతేకాకుండా చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. జుట్టు పెరగడానికి వివిధ రకాల ట్రీట్మెంట్లను తీసుకుంటూ, వేలకు వేలు డబ్బులను వృధా చేస్తుంటారు. అంతే కాకుండా బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగించడం వల్ల కొన్ని కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి.
అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఊడిపోయిన జుట్టు మళ్ళీ తిరిగి రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలోవెరా జెల్ ను జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు కొత్త జుట్టు మొలుస్తుంది. అలాగే జుట్టుకు సరిపడా అలోవెరా జెల్ తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుంటే అది లిక్విడ్ లాగా తయారవుతుంది. జెల్ అప్లై చేస్తే అది స్కాల్ప్ మీదనే ఉండిపోతుంది. జెల్ లాగా ఉండడం వలన కుదుళ్ల లోపలికి వెళ్లలేదు. అలోవెరా జెల్ ను జ్యూస్ చేసి అప్లై చేయడం వలన అది లిక్విడ్ రూపంలో ఉంటుంది. కాబట్టి కుదుళ్ళ లోపలి వరకు వెళ్లి జుట్టుని కుదుళ్ళ నుండి బలంగా చేస్తుంది. అలోవెరాలో విటమిన్ బి12 ఉంటుంది.
100 గ్రాముల అలోవెరా లిక్విడ్ లో 10.9 మైక్రోగ్రామ్స్, విటమిన్ బి 12 ఉంటుంది. శరీరంలో విటమిన్ బి 12 లోపం ఉంటే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అలోవెరా లో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి ఉంటాయి. ఇవి జుట్టు ఊడిన వెంటనే కొత్త వెంట్రుకలు రావటానికి బాగా సహాయపడుతుంది. ఇది జుట్టును డ్రై అవ్వకుండా ఉండేలా చేస్తుంది. జుట్టు కుదుళ్లలో ఆయిల్స్ రిలీజ్ చేసే కణజాలం ఉంటుంది. ఇది స్కాల్ప్ హెయిర్ డ్రై అవ్వకుండా ఉండేలా చేస్తుంది. ఈ కణజాలం ఆయిల్స్ రిలీజ్ చేయకపోవడం వలన స్కాల్ డ్రై అయిపోయి చుండ్రు వస్తుంది. ఈ అలోవెరా జ్యూస్ అప్లై చేసినట్లయితే ఆయిల్స్ అవసరమైన మోతాదులో రిలీజ్ అయ్యి చుండ్రు సమస్య తగ్గుతుంది. అలోవెరా లిక్విడ్ అప్లై చేయడం వలన ఒక వెంట్రుక ఊడిన దగ్గర నుండి వెంట్రుకలు రావడానికి 20 రోజులు సమయం పడుతుంది. అలోవెరా లిక్విడ్ అప్లై చేస్తే వెంటనే వెంట్రుకలు వస్తాయి. అందుకే ఇకనుండి అలోవెరా జెల్ కాకుండా అలోవెరా జ్యూస్ అప్లై చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలోవెరా జెల్ కంటే అలోవెరా లిక్విడ్ జుట్టు రాలడం సమస్యను తగ్గిస్తుంది. జుట్టుకురుల వరకు ఇంకి కొత్త వెంట్రుకలు త్వరగా రావటంలో ఈ అలోవెరా లిక్విడ్ సహాయ పడుతుంది. అందుకనే అలోవెరా జెల్ కాకుండా అలావేరా లిక్విడ్ ని ఉపయోగించండి. ఇది జుట్టు రాలడం సమస్యను తగ్గించి చుండ్రు లేకుండా చేస్తుంది.