Site icon HashtagU Telugu

Hair Tips: మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అంటే.. వీటిని జుట్టుకు అప్లై చేయాల్సిందే?

Mixcollage 27 Dec 2023 02 43 Pm 6432

Mixcollage 27 Dec 2023 02 43 Pm 6432

ఈ రోజుల్లో యువత జుట్టుకు సంబంధించిన సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా జుట్టు రాలే సమస్యతో ఎక్కువ శాతం మంది సతమతమవుతున్నారు. వాతావరణ పరిస్థితులు అలాగే అధిక ఒత్తిడి,డిప్రెషన్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఇలా అనేక రకాల కారణాల వల్ల జుట్టు రాలడం లాంటి సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఈ సమస్యని కంట్రోల్ చేయడానికి అనేక రకాల నూనెలను హెయిర్ ప్యాక్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. వాటి వల్ల మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మేం తెలుసుకోబోయే ప్యాక్ ని ట్రై చేస్తే చాలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఆ జుట్టు దృఢంగా,ఒత్తుగా పెరుగుతుంది.

మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికొస్తే.. ఇందుకోసం నాలుగు లేదా ఐదు మందార ఆకులు లేదా మందార పూలను తీసుకొని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మందార ఆకులు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడంలో ఉపయోగపడతాయి. మందార ఆకులను జుట్టుకి ఉపయోగించడం వల్ల జుట్టు సిల్కీలా మెరుస్తుంది. ఆ తరువాత రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిలో అధిక పరిమాణంలో పోషకాలు ఉండడం వల్ల జుట్టుకు కావాల్సిన పోషన్ను అందజేసి జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పొడువుగా పెరిగేలా సహాయపడతాయి. ఆ తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకొని దానిపైన ఉన్న పొరనే తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

వీటన్నింటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పల్చటి క్లాత్ సహాయంతో రసాన్ని వేరు చేసి జుట్టు కుదుళ్ళకి బాగా అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయాలి ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీరు కూడా దీన్ని ట్రై చేశారంటే మీ జుట్టు హెల్దీగా పొడవుగా పెరుగుతుంది. రెమిడి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు.