Site icon HashtagU Telugu

Hair Tips: ఎన్ని చేసినా జుట్టు రాలడం ఆగడం లేదా.. అయితే ఈ ఒక్కటి ట్రై చేస్తే చాలు?

Mixcollage 12 Jan 2024 04 57 Pm 3778

Mixcollage 12 Jan 2024 04 57 Pm 3778

ఇటీవల కాలంలో జుట్టు రాలడం అన్నది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఆడ,మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసు నుంచే ఈ హెయిర్ ఫాల్ సమస్య మొదలవుతోంది. ప్రస్తుత జనరేషన్ లో చాలామంది తీసుకునే ఆహార పదార్థాలు అలాగే రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లు ఉపయోగించడం వల్ల ఈ హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా మందిలో జుట్టు రాలడం, చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ జుట్టు రాలడం ఆపడం కోసం చాలామంది ఎన్నో రకాల షాంపూలు నూనెలు వాడుతూ ఉంటారు.

అయినప్పటికీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అందుకోసం కోసం పెరుగు, అలోవెరా జెల్, శీకాకాయ పొడి తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో రెండు చెంచాల పెరుగు వేసుకోవాలి. పెరుగు స్కాల్ప్‌పై ఉండే ఇన్ఫెక్షన్స్‌ను తగ్గిస్తుంది. చుండ్రు సమస్యను దూరం చేస్తుంది. ఒక చెంచా శీకాకాయ పొడి వేసుకోవాలి. చింతకాయ గురించి దాని ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. ఇది జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో ఒక చెంచా అలోవెరా జెల్ వేసుకోవాలి. అలోవెరా జెల్ కూడా చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గించడంలో చాలా బాగా పని చేస్తుంది. అలాగే మాడుపై ఉండే ఇన్ఫెక్షన్‌ను పోగొడుతుంది.

పెరుగు, శీకాకాయ పొడి, అలోవెరా జెన్‌ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత జుట్టును నీళ్లతో తడుపుకుని ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. జుట్టు చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే ప్రయోజనం కనిపిస్తుంది. నిగనిగ లాడే జుట్టు మీ సొంతం అవుతుంది. అలాగే జుట్టు కుదుళ్ల నుంచి బలంగా తయారవుతుంది. తలస్నానం చేసిన తర్వాత ఎలాంటి కండిషనర్లు వాడాల్సిన అవసరం లేదు. ఈ ఈజీ చిట్కాతో చుండ్రు తగ్గించుకోవడంతో పాటు జుట్టు ఒత్తుగా, పొడవుగ్గా పెరుగుతుంది.