ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహరపు అలవాట్లు వాతావరణ కాలుష్యం కారణంగా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో జుట్టు సమస్య కూడా ఒకటి. ఎంతోమంది జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఎంతోమంది అధిక జుట్టు రాలే సమస్యతో సతమతమవుతున్నారు. ఇలా జుట్టు సమస్యలకు ఎన్నో పరిష్కారం మార్గాలను ఉపయోగిస్తూ ఉన్నప్పటికీ ఎలాంటి ఫలితం మాత్రం ఉండదు. ఇలా తరచూ జుట్టు రాలిపోయి జుట్టు పులుచగా అయిపోతూ ఉంటుంది. అయితే అలా మీరు కూడా పలుచని జుట్టుతో బాధ పడుతున్నారా. అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే. ఇందుకోసం ఒక కప్పు కొబ్బరి నూనెను తీసుకొని దీనిని స్టవ్ పై పెట్టి కొద్దిసేపు వేడి చేయాలి.
తర్వాత కలమంద తీసుకొని వాటిని శుభ్రం చేసుకొని వాటిని చిన్నచిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఆ నూనెలో వేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకుని కూడా ఈ నూనెలో వేయాలి. అదేవిధంగా ఈ ఆయిల్ లో ఉల్లిపాయ ను సన్నని మొక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కలిపి స్టవ్ పై ఒక 30 నిమిషాల వరకు మరగనివ్వాలి. తరువాత స్టవ్ ఆపుకొని ఈ నూనెను చల్లారిన తర్వాత వడకట్టి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇది 25 రోజుల వరకు నిలువ ఉంటుంది. వీటిలో వాడిన పదార్థాలు ఒకటి కలమంద ఇది ఉడిపోయిన జుట్టు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.అలాగే కరివేపాకు తలలో ఉండే ఇన్ఫెక్షన్ ను నివారించడానికి సహాయపడుతుంది.
అలాగే దురద, చుండ్రు ,తలనొప్పి లాంటి ఇబ్బందుల్ని కూడా నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అయితే ఈ నూనెను వాడుకునే ముందు మళ్లీ వేడి చేసి చల్లారి తర్వాత మీరు తలకి రాసుకుని 15 నిమిషాల పాటు ఉంచి కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఇలా ఒక 15 రోజులు వాడినట్లయితే మీ జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే. మళ్లీ ఒత్తుగా, పొడవుగా, సిల్కీగా పెరుగుతుంది. కాబట్టి ఈ నూనెను ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవచ్చు.