Site icon HashtagU Telugu

Hair Tips: నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే చాలు తలలో పేలు మాయం అవ్వాల్సిందే?

Mixcollage 29 Dec 2023 04 06 Pm 9395

Mixcollage 29 Dec 2023 04 06 Pm 9395

మామూలుగా స్కూల్ కి వెళ్లే పిల్లలు నుంచి పెద్దవారి వరకు స్త్రీ పురుషులు అన్న తేడా లేకుండా చాలామంది పేలు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరికి తలలో పేలు ఎక్కువగా ఉండి పదే పదే తలను గోక్కుంటూ ఉంటారు. ఈ తలలో పేలు కారణంగా కొన్ని కొన్ని సార్లు అధికంగా హెయిర్ ఫాల్ అవ్వడం చుండ్రు రావడం లాంటి సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ పేలు సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది వంటింటి చిట్కాలతో పాటు కొన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ ని అలాగే కొన్ని బ్యూటీ ప్రోడక్ట్ లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పేలు పేలు సమస్య తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దీనికోసం మనం ముందుగా జుట్టుకు సరిపడా కొబ్బరినూనెను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో మూడు కర్పూరం బిళ్ళలను వేసి మెత్తగా పొడి చేసి వేసి బాగా కలుపుకోవాలి. ఈ నూనెను తలకు అప్లై చేసుకోవాలి. మూడు గంటలపాటు ఆరనిచ్చి తర్వాత ఏదైనా షాంపుతో తలస్నానం చేయాలి. ఈ నూనె వాసనకు ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్నవారు ప్రతిరోజు వాడవచ్చు. ఇలా తయారు చేసుకున్న నూనెను వారానికి ఒకసారి జుట్టుకు అప్లై చేసినట్లయితే తలలో ఉండే పేలు, చుండ్రు, ఇన్ఫెక్షన్ తగ్గిపోతాయి. అలాగే తలలో వచ్చే చిన్న చిన్న పొక్కులు కూడా తగ్గిపోతాయి. చుండ్రు ఉంటే జుట్టు పెరగదు. అలాంటప్పుడు ఈ నూనె రాస్తే చుండ్రు కూడా తగ్గిపోతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

అలాగే మరొక చిట్కా ఏంటంటే మెంతులను నానబెట్టి పేస్ట్ చేసి అందులో కూడా కర్పూరం బిళ్ళలు వేసి తలకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత రెండు మూడు గంటలు ఆరనివ్వాలి. తర్వాత తల స్నానం చేస్తే తలలో ఉండే పేలు, చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ ప్యాక్ ను కూడా వారానికి ఒకసారి అప్లై చేయాలి. అలాగే రెండు లేదా మూడు చెంచాల కొబ్బరి నూనెలో ఒక స్పూన్ వేప నూనె వేసి బాగా కలిపి తలకు రాసుకోవాలి. రెండు మూడు గంటలసేపు ఆరనిచ్చి తర్వాత తలస్నానం చేయాలి.

ఇలా వారానికి ఒకసారి చేయడం వలన తలలో పేలు,చుండ్రు, ఇన్ఫెక్షన్స్, కురుపులు వంటి సమస్యలు తగ్గిపోతాయి. వేపాకులు దొరుకుతాయి అనుకున్న వారు ఆకులను పేస్ట్ చేసి తలకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వేప నూనె వేపాకులు దొరకనివారు మార్కెట్లో రెడీమేడ్ వేపాకు దొరుకుతుంది. దాన్ని పుల్లటి పెరుగులో కలిపి తలకు అప్లై చేసి రెండు లేదా మూడు గంటలసేపు ఆరనివ్వాలి. తర్వాత తల స్నానం చేయడం వలన చుండ్రు, పేలు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గిపోతాయి. అయితే ఈ మూడు చిట్కాలను ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏది చేయాలనిపిస్తే ఆ చిట్కాను ట్రై చేయవచ్చు.