Site icon HashtagU Telugu

Hair Tips: జుట్టు పదేపదే నెరిసిపోతోందా.. అయితే కరివేపాకుతో ఈ విధంగా చేయాల్సిందే?

Mixcollage 25 Dec 2023 05 04 Pm 7681

Mixcollage 25 Dec 2023 05 04 Pm 7681

కరివేపాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కరివేపాకులు లేకుండా చాలా వరకు కొన్ని రకాల వంటలు అస్సలు పూర్తికావు. ఈ కరివేపాకు కూరకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. కానీ చాలామంది కూరలో కరివేపాకుని తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కరివేపాకు వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా కరివేపాకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన సమస్యలకు కరివేపాకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. జుట్టు నల్లగా మార్చడంలో హెయిర్ ఫాల్ ని తగ్గించడంలో అలాగే కొత్త మొలిపించడానికి ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు కరివేపాకులో బి విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది హెయిర్ ఫోలికల్స్ లో మెలనిన్ ఉత్పత్ చేయడానికి పనిచేస్తాయి. ఇక తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు కరివేపాకుతో కొన్ని రకాల రెమెడీలు పాటించడం వల్ల ఈ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవచ్చు. తరచూ జుట్టు పదేపదే తెల్లగా అవుతున్నవారు కరివేపాకుతో కొన్ని రెమిడీలు పాటించాల్సిందే.

అందుకోసం ఏం చేయాలంటే.. జుట్టుకు కరివేపాకు హెయిర్ మాస్క్ తయారు చేసుకోని వేసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. కరివేపాకు జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. మెలనిన్ లోపం వలన జుట్టు తెల్లగా అయిపోతుంది. ఇలాంటి సమయంలో కరివేపాకుతో చేసిన హెయిర్ మాస్కుని జుట్టుకి పెడితే తెల్ల జుట్టు సమస్య దూరం అవుతుంది. దీంతో పాటు జుట్టు ఆరోగ్యంగా మృదుగా తయారవుతుంది. దీనికోసం ముందుగా ఒక పాన్లో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి వేడి చేసి అందులో 10, 12 కరివేపాకులు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 20 నిమిషాలు చల్లారనిచ్చాక పక్కన పెట్టాలి. జుట్టు మీద కరివేపాకు మాస్క్ వేయడానికి రెండు చేతులతో మొత్తం జుట్టు మీద అప్లై చేయాలి. ముందుగా ఈ మాస్క్ తో జుట్టు కుదుర్లను మసాజ్ చేసి తర్వాత జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. ఒక గంట తర్వాత జుట్టును కడగాలి. జుట్టు చాలా మృదువుగా మెరిసేలా తయారవుతుంది. కరివేపాకు పెరుగుతో హెయిర్ మాస్క్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మాస్క్ చుండ్రును తొలగించడానికి బాగా సహాయపడుతుంది. దీనికోసం ఒక గిన్నెలో కొద్దిగా పెరుగు, మూడు నాలుగు కరివేపాకుల పేస్ట్ వేసి బాగా కలిపి ఆ తర్వాత జుట్టుకు పట్టించాలి. దీంతో జుట్టు ఆరోగ్యంగా, బలంగా తయారవుతుంది.