Site icon HashtagU Telugu

Hair Tips: మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతోందా.. అయితే ఈ సిరప్ రాయాల్సిందే?

Mixcollage 31 Dec 2023 05 14 Pm 472

Mixcollage 31 Dec 2023 05 14 Pm 472

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి. ఈ జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది అనేక రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తే మరి కొందరు ఆయుర్వేదిక్ మందులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు ఇంట్లోనే హోమ్ రెమిడీలను ఫాలో అవుతూ ఉంటారు. ఇలా ఎన్ని చేసినా కూడా వెంట్రుకలు రాలిపోవడం తప్ప కొత్త జుట్టు మొలవడం కానీ జుట్టు రాలిపోవడం ఆగిపోవడం గాని జరగక చాలామంది దిగులు చెందుతూ ఉంటారు. అయితే అలాంటప్పుడు ఏం చేయాలి జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే జుట్టు రాలడం ఆగిపోయి కొత్త జుట్టు మొలవాలి అంటే ఇప్పుడు మేము చెప్పబోయే ఒక న్యాచురల్ సిరప్ ను ట్రై చేయాల్సిందే. ఇందుకోసం ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని దానిని తురిమి దాని నుంచి రసం తీసుకోవాలి. అలాగే కలబంద తీసుకొని దానిలో గుజ్జును కూడా అల్లం రసంతో సమానంగా తీసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కాపీ పొడి దీనిలో కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి నూనె నాలుగు స్పూన్లు వేసి, ఇవి అన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 30 నిమిషాలు పాటు పక్కన పెట్టుకోవాలి. అయితే దీనిలో వాడిన కలమందలు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది జుట్టు ఒత్తుగా పెరగడానికి, జుట్టు సిల్కీ గా తయారవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

అదేవిధంగా అల్లం యాంటీ ఆక్సిడెంట్, పొటాషియం, మోగ్నీషియం ఇవన్నీ ఉంటాయి. దీనివలన జుట్టు ఊడిపోవడం, చుండ్రు లాంటి సమస్యలను తగ్గించే గుణాలు ఉంటాయి. అలాగే కాపీ పొడిలోని కెపిన్ అనే పదార్థం ఉంటుంది. దీని వలన జుట్టు బలంగా స్మూత్ గా ఉంటుంది. ఇలా రకరకాలుగా ఔషధ గుణాలు ఉన్న ఈ మిశ్రమాన్ని జుట్టుకు కుదుల నుండి, చివరి భాగాల వరకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఉండాలి. తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఎలా వారంలో మూడు సార్లు దీనిని రాసుకుంటే, ఉడిన మీ జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది. అలాగే జుట్టు ఒత్తుగా, స్మూత్ గా, పొడవుగా పెరుగుతుంది. ఇలా నేచురల్ గా ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకుంటే మీ జుట్టు ఎప్పటికీ ఊడదు. అలాగే కొత్త జుట్టు కూడా మొలుస్తుంది. ఈ చిట్కాను ఉపయోగించిన కొన్ని రోజుల్లోనే మీరు ఫలితాలను చూడవచ్చు.