హెయిర్ ఫాల్.. ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులను వేధిస్తున్న సమస్యలలో ఇది కూడా ఒకటి. ఈ హెయిర్ ఫాల్ కారణంగా మగవారు బట్టతల సమస్యతో బాధపడుతుంటే స్త్రీలు పొట్టి జుట్టుతో ఇబ్బంది పడుతున్నారు. యుక్త వయసు నుంచే ఈ సమస్య మొదలవుతోంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడడం కోసం చాలామంది అనేక రకాల చిట్కాలను బ్యూటీ ప్రాడక్టులను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల ఫలితం లేకపోవడంతో దిగులు చెందుతూ ఉంటారు. అయితే అధికంగా హెయిర్ ఫాల్ అవుతున్న వారి కోసం ఇప్పుడు మేము కొన్ని సింపుల్ చిట్కాలను మంచి మంచి చిట్కాలను తీసుకువచ్చాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రీన్ టీలో ఎక్కువ మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు పెరగడానికి కూడా బాగా సహాయపడుతుంది. గ్రీన్ టీ చల్లారబెట్టి ఆ తర్వాత ఆ టీ మిశ్రమాన్ని మాడుకు రాసుకోవాలి. తర్వాత ఒక గంట పాటు అలాగే ఉంచి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఉల్లిపాయతో తయారు చేసిన జ్యూస్ ను మాడుకి అప్లై చేయడం వలన జుట్టు రాలడం ఆగిపోయి మళ్లీ జుట్టు పెరగడం మొదలవుతుంది. దానికి కారణం ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మూలకాలే. ఉల్లిపాయ జ్యూస్ 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత తక్కువ గాడత ఉన్న షాంపులతో శుభ్రం చేసుకోవాలి. కలబంద వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కలబంద చర్మం జుట్టు సమస్యలకు ఎంతో బాగా పనిచేస్తుంది.
కలబంద గుజ్జును తలపై అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత తల స్నానం చేయడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గి జుట్టు మళ్ళీ పెరుగుతుంది. కోడిగుడ్డు కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే ప్రోటీన్ కూడా జుట్టు పెరగడానికి సహాయపడుతుందట. కోడిగుడ్డును పగల కొట్టి దానిని తలకి అప్లై చేసి 30 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో షాంపూ చేయాలి. ఇలా చేస్తే హెయిర్ ఫాల్ సమస్య తగ్గి జుట్టు పెరుగుతుంది.