Site icon HashtagU Telugu

Hair Tips: జుట్టు పల్చగా ఉందని బాధపడుతున్నారా.. అయితే ఇది రాస్తే చాలు జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాల్సిందే!

Mixcollage 24 Dec 2023 03 53 Pm 3837

Mixcollage 24 Dec 2023 03 53 Pm 3837

ప్రస్తుత రోజుల్లో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో జుట్టు సమస్యలు కూడా ఒకటి. జుట్టు చిట్లిపోవడం తెల్ల జుట్టు రావడం జుట్టు రాలిపోవడం జుట్టు పల్చగా అయిపోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వీటికీ ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది స్త్రీ పురుషులు పలుచని జుట్టుతో బాధపడుతూ ఉంటారు.. ఇక తలపై వెంట్రుకలను పెంచుకోవడం కోసం ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ చిట్కాను పాటిస్తే చాలు జుట్టు వద్దన్నా పెరుగుతుంది.

మరి ఒత్తైన జుట్టు కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదటగా ఒక గిన్నెను తీసుకొని దానిలో మూడు వందల ml కొబ్బరి నూనె తీసుకోవాలి. ఆ గిన్నెను స్టవ్ పై పెట్టి స్టవ్ ని సిమ్ లో పెట్టి దానిలో మొదటిగా ఒక చెంచా ఆవాలు వెయ్యాలి. ఆ తదుపరి ఒక చెంచా మెంతులు కూడా వేయాలి. ఆ తర్వాత నాలుగు లవంగాలు కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలను కూడా వెయ్యాలి. తర్వాత మందార పువ్వులుని ఒక ఐదు వేసుకోవాలి. తర్వాత ఎండి ఉసిరి ముక్కలను ఒక గుప్పెడు వేయాలి. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేయాలి. తర్వాత గరిక ఆకులని ఒక గుప్పెడు వేసుకోవాలి.

ఆ తర్వాత నాలుగు తులసి ఆకులని కూడా వేసి తర్వాత గుప్పెడు మందర ఆకుల్ని కూడా వేసుకోవాలి. అలాగే గోరింట ఆకులను కూడా తీసుకొని అందులో వేయాలి. ఇలా అన్నింటిని వేసిన తర్వాత సన్నని సెగపై నూనె కలర్ మారేవరకు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన ఆయిల్ ని వేడిగా ఉన్నప్పుడే వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఆయిల్ ని నిత్యము మనం జుట్టు కుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసుకోవాలి. ఇలా వాడడం వలన 15 రోజుల్లోనే కొత్త జుట్టు రావడం ప్రారంభమవుతుంది. దీనిని వారానికి రెండుసార్లు ఇలా అప్లై చేసుకున్న తర్వాత వారంలో రెండుసార్లు గాఢత తక్కువ ఉన్న షాంపూ ని ఉపయోగించి తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన మీ జుట్టు ఎంతో ఫాస్ట్ గా ,ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.