Hair Loss: అధికంగా హెయిర్ ఫాల్ అవుతోందా.. అయితే ఇలా చేయాల్సిందే?

  • Written By:
  • Updated On - March 8, 2024 / 03:56 PM IST

ప్రస్తుత రోజుల్లో జుట్టు ఎక్కువగా రాలిపోవడం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. దీని కారణంగా చాలామంది పొట్టి జుట్టు, పలుచని జుట్టు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొందరిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా అధికంగా హెయిర్ ఫాల్ అవుతుంటే అలాంటి సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మరి హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇక అటువంటి వారు మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే జుట్టు ఊడిపోయే సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.. జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోగలిగే ఈ ప్యాక్ ను ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనికోసం చేయవలసిందల్లా బాగా పండిన అరటిపండ్లను తీసుకొని అరటి పండ్లు బాగా గుజ్జుగా మెత్తగా పేస్ట్ చేసుకుని ఆ పేస్టును మాడు నుంచి కురుల వరకు పట్టించి, ఒక అరగంటసేపు ఆరనిచ్చి ఆపై తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నిగారింపు సొంతం చేసుకోవడమే కాకుండా, అరటి పండులో ఉండే క్యాల్షియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

అవసరమైన పోషకాలను అందించటానికి కూడా అరటిపండు సహాయపడుతుంది. అరటిపండు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.జుట్టు రాలిపోయే వారు చుండ్రు సమస్యను, జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి పెరుగులో అరటిపండు కలిపి తలకు పట్టించి, ఒక అరగంట సేపు అలానే ఉంచి ఆ తర్వాత తలస్నానం చేయాలి. పెరుగు అరటిపండు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చుండ్రును మరియు చుండ్రు వల్ల కలిగే దురదలను, జుట్టు రాలిపోవడాన్ని తగ్గించి, చుండ్రు వల్ల కలిగే దురదల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు అరటి పండులో ఉండే విటమిన్లు, ఖనిజాలు జుట్టుకు సహజ కండిషనర్ గా పనిచేస్తాయి. మృదువుగా మారుస్తాయి. ఇక అరటిపండును నిత్యం మనం ఆహారంలో భాగంగా తీసుకున్నా , జుట్టు సమస్యల పరిష్కారం కోసం తలకు బాగా పట్టించినా మంచి ఫలితమే ఉంటుంది. జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకునేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే మంచిది.