Hair Tips: ప్రతిరోజు దీన్ని తలకు పట్టిస్తే చాలు.. జుట్టు గడ్డిలా గుబురుగా పెరగడం ఖాయం?

ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు చాలామంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. హెయిర్ ఫాల్ బట్టతల రావడం,జుట్టు చి

Published By: HashtagU Telugu Desk
Mixcollage 11 Jan 2024 04 29 Pm 8864

Mixcollage 11 Jan 2024 04 29 Pm 8864

ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు చాలామంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. హెయిర్ ఫాల్ బట్టతల రావడం,జుట్టు చిట్లి పోవడం,చుండ్రు లాంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్య అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ హెయిర్ ఫాల్ సమస్య ఆగిపోయి జుట్టు మునుపటిలాగే పెరగడం కోసం చాలామంది ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉపయోగించినప్పటికీ సరైన ఫలితం రాక దిగులు చెందుతూ ఉంటారు. మీరు కూడా అలా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా. ఇకమీదట దిగులు చెందాల్సిన పనిలేదు.

ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు జుట్టు గడ్డి లాగా గుబురుగా పెరగడం ఖాయం. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. అవిసె గింజలతోనే జుట్టును బాగు చేసుకోవచ్చు. జుట్టు సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే ముందుగా ఒక కప్పు అవిసె గింజలు తీసుకొని దానికి నాలుగు కప్పులు నీటిని వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా చేయడం వల్ల జెల్ తయారవుతుంది. కాస్త పలుచుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి ఈ నేటిని వేడిగా ఉండగానే పలచటి బట్ట సహాయంతో వడకట్టుకోవాలి. మరీ గట్టి పడితే వడకట్టు కోవడం చాలా కష్టం అవుతుంది. ఇలా వడకట్టిన జెల్ ని చల్లారిన తర్వాత తలకు అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత తల స్నానం చేయాలి.

ఇలా తరచుగా చేయడం వల్ల జుట్టు మృదువుగా, పొడవుగా, నల్లగా, బలంగా, ఒత్తుగా తయారవుతుంది. అంతే కాకుండా పలు రకాల జుట్టు సమస్యలను కూడా తరిమి కొడుతుంది. అవిసె గింజల జెల్ అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారు అవుతాయి. అంతే కాకుండా జుట్టు చాలా త్వరగా వద్దన్నా విపరీతమైన పొడవుగా పెరుగుతుంది. అవిసె గింజల్లో విటామిన్ ఇ అధికంగా ఉంటుంది. దీన్ని వల్ల స్కాల్ప్ కు పోషణ అందించి ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ ను తగ్గిస్తుంది. ఫ్లాక్స్ సీడ్ జెల్ ఉపయోగించే ముందు ఉపయోగించాక మీ జుట్టులో ఏర్పడే మార్పులను మీరే గమనించుకోవచ్చు. అయితే విటామిన్ ఇ చర్మం మరియు జుట్టు రెండింటికీ మేలు చేస్తుంది. అలాగే జుట్టు మూలాల వరకు రక్త ప్రసరణను పెంచుతుంది. అంతే కాదు తెల్ల జుట్టు సమస్య కూడా పరిష్కారమవుతుంది. ఈ జెల్ ను హెయిర్ కండీషనర్ గా అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా బలంగా తయారవుతుంది. అయితే ఈ జెల్ ను మీరు 10 నుంచి 15 రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచి వాడుకోవచ్చు. అంతే కాకుండా దీనికి ఏదైనా నూనె కలపడం వల్ల మరిన్ని లాబాలు కలుగుతాయి. .

  Last Updated: 11 Jan 2024, 04:29 PM IST