Hair Growth: కొబ్బరి నూనెలో ఇది కలిపి రాస్తే చాలు.. జుట్టు గడ్డిలా గుబురుగా పెరగాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొంతమందికి అయితే మరీ దారుణంగా కుచ్చులుగా ఎక్కువ మొత్తంలో వెం

  • Written By:
  • Updated On - February 15, 2024 / 02:43 PM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొంతమందికి అయితే మరీ దారుణంగా కుచ్చులుగా ఎక్కువ మొత్తంలో వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. జుట్టు రాలిపోవడం పెద్ద సమస్య అనుకుంటే వాటికి తోడు జుట్టు త్వరగా తెల్ల బడటం, చిట్లిపోవడం వంటి సమస్యలు మరింత బాధ పెడుతూ ఉంటాయి. జుట్టు రాలే సమస్యను అధిగమించడానికి చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకోసం వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. అయితే మీరు కూడా అలా అధిక హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా అయితే కొబ్బరి నూనెతో ఇలా చేయాల్సిందే.

ముందుగా ఈ నూరు వరహాల పూలను మీకు కావలసినవి తెచ్చుకోండి. రెండు పూల గుత్తులను చక్కగా మిక్సీ జార్ లోకి తీసుకొని అందులోకి ఎ తులసి ఆకులను వేయాలి. వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు పొడిపొడిగా ఉండే పౌడర్ బయటికి వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో ప్యూర్ కోకోనట్ ఆయిల్ మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. కొబ్బరి నూనె యాడ్ చేసుకున్న తర్వాత నూరు వరహాల పూల మిశ్రమాన్ని ఈ కోకోనట్ ఆయిల్ లో వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా ఇలా బాగా కలిపి మరగనివ్వాలి. కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనం యాడ్ చేసుకోబోయే మరొక ఇంగ్రిడియంట్స్ కలోంజి గింజలు.

నూనె బాగా మరిగిన తర్వాత స్టవ్ దింపేసి ఒక క్లాత్ సహాయంతో వాడకట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. మీరు అప్లై చేసుకునే ముందు చేతిలో కంటే ఒక బౌల్లోకి తీసుకొని కాటన్ తో తీసుకోవడం మంచిది. ఆ తర్వాత కొద్దిసేపు ఆగి తల స్నానం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తే హెయిర్ ఫాల్స్ సమస్య అనేది మీ దరిదాపుల్లోకి కూడా రాదు.