Site icon HashtagU Telugu

Hair Tips: జుట్టు ఎక్కువగా ఊడిపోతోందా.. అయితే ఇలా చేస్తే చాలు ఒక వెంట్రుక కూడా రాలదు?

Mixcollage 02 Jan 2024 06 20 Pm 3495

Mixcollage 02 Jan 2024 06 20 Pm 3495

స్త్రీలకు అందమైన పొడవాటి జుట్టు మరింత అందాన్ని ఇస్తుంది. కానీ కొందరు స్త్రీలకు జుట్టు పొడవుగా ఉంటే మరికొన్ని స్త్రీలకు పలుచగా పొట్టిగా ఉంటుంది. దాంతో చాలామంది చాలా బాధపడిపోతూ ఉంటారు. అందమైన నల్లటి పొడవాటి జుట్టు కావాలని ప్రతి ఒక అమ్మాయి కూడా కోరుకుంటూ ఉంటుంది. కానీ చాలామంది ప్రస్తుత రోజుల్లో ఎక్కువ హెయిర్ ఫాల్ కారణంగా చాలా బాధపడుతూ ఉంటారు. మరి హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోయి జుట్టు బాగా పెరగాలి అంటే ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు జుట్టు ఊడిపోవడం ఆగిపోవడంతో పాటు కొత్త జుట్టు మొలుస్తుంది. ఉల్లిపాయల రసం చాలా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ ముక్కలను మిక్సీలో వేసి రసం చేయాలి. దీనితో ఆలివ్ ఆయిల్ కలుపుకొని దీని హెయిర్ ఆయిల్ రాసిన మాదిరిగానే దీనిని కూడా అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కుంకుడు కాయలతో కడిగేయాలి ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన 90% కూడిన జుట్టు తిరిగి వస్తుంది. అలాగే గంజి గంజి అంటే మనం అన్నం వండుకునేటప్పుడు రైస్ లో ఎక్కువ వాటర్ ను పోసుకొని దాన్లోంచి గంజి తీసుకోవాలి. ఇలా తీసుకున్న గంజి చల్లారిన తర్వాత జుట్టుకు కుదురులకు బాగా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న 30 నిమిషాలు తర్వాత కడిగేయాలి.

అలాగే కరివేపాకు ఈ కరివేపాకు జుట్టుకు ఎంతో మంచి ఔషధం లాగా పనిచేస్తుంది దీనిని ఒక గుప్పెడు తీసుకొని ఏదైనా హెయిర్ ఆయిల్ ను తీసుకొని 100 గ్రాములు ఆయిల్ ఒక బౌల్లోకి పోసుకొని దాన్లో గుప్పెడు కరివేపాకు వేసి ఐదు నిమిషాల వరకు వేడి చేయాలి తర్వాత దానిని చల్లారనివ్వాలి. దీని వడకట్టి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని దీనిని తలస్నానం చేసే ముందు అప్లై చేసుకొని 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేయడం వలన ఏడు రోజులలో ఉడిన జుట్టు తిరిగి వస్తుంది.

Exit mobile version