Site icon HashtagU Telugu

Hair Tips: జుట్టు ఒత్తుగా పెరిగి బట్టతలపై కూడా వెంట్రుకలు రావాలంటే ఈ రెమెడీ ట్రై చేయాల్సిందే?

Mixcollage 03 Dec 2023 08 43 Pm 3449

Mixcollage 03 Dec 2023 08 43 Pm 3449

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో జుట్టు సమస్యలు కూడా ఒకటి. ఇందులో హెయిర్ ఫాల్ సమస్య ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి అనేక రకాల బ్యూటీ ప్రాడక్టులను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఫలితం కనిపించకపోవడంతో దిగులు చెందుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెమెడీని పాటిస్తే చాలు జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు బట్ట తలపై కూడా వెంట్రుకలు మొలుస్తాయి. ఈ రెమిడీ కోసం మనకు బియ్యం నీరు కావాలి. బియ్యం నీరు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసింది. బియ్యం నీటిలో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

అలాగే ఈ నీరు కేవలం జుట్టుకే మాత్రమే కాకుండా మీ స్కిన్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇదివరకటి రోజులో బియ్యం కడిగిన నీటిని కూడా తాగేవారు దాంతో రక్తప్రసరణ సరిగా ఉండి, వాళ్ళు నిత్య యవ్వనంగా ఉండేవారు. ఎందుకంటే ఈ బియ్యం వాటర్ చర్మ కణాలను మెరుగుపరిచి చర్మం బిగుతుగా చేసి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం వరకు వేసుకోండి. మీరు ఏ రకం బియ్యం అయిన పర్వాలేదు. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒకసారి లైట్ గా వాష్ చేయాలి. మరి గట్టిగా ప్రెస్ చేసి కాకుండా కొద్దిగా దుమ్ముపోయేలా వాష్ చేయాలి. ఆ తర్వాత బియ్యం మునిగేలా చక్కగా వాటర్ పోసి చేతితో మరొకసారి బాగా కలిపి అలా మూత పెట్టి 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.

ఇప్పుడు 20 నుంచి 30 నిమిషాలు అయిన తర్వాత చేతితో ఒకసారి కలిపితే తెల్లగా మంచి వాటర్ అయితే తయారవుతుంది. ఈ నీటిని మీరు ఒక గాజు కంటైనర్ లో వడకట్టుకుని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా ఎటువంటి సమస్యలు లేని హెయిర్ అయితే ఈ బియ్యం వాటర్ ని యధావిధిగా అప్లై చేసుకోవచ్చు. అంటే 24 గంటలు పులియపెట్టిన తర్వాత దీనిని వాడుకోవాలి. ఒకవేళ మీ హెయిర్ డ్రై గా ఉంటే కనుక ఒక బౌల్ తీసుకొని మీ హెయిర్ కి కావాల్సిన బియ్యం వాటర్ వేసుకోవాలి. అలాగే అందులో ఒకటిన్నర స్పూన్ లేదా ఒక స్పూన్ వరకు మీకు నచ్చిన ఆయిల్ కలుపుకోవాలి. అంటే ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె ఇలా ఏదైనా సరే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేస్తే బాగా కలిపి చిన్న కాటన్ సహాయంతో మీ హెయిర్ కి అప్లై చేసుకోవాలి. ఎక్కడైతే మీ హెయిర్ డ్యామేజ్ అయ్యిందో అక్కడ ఎక్కువగా దూదితో అద్దినట్టు చక్కగా ఇలా మొత్తం స్కాలర్ కి పట్టించండి. ఇలా పట్టించి ఒక గంట వరకు అలా ఉంచుకోవాలి. తర్వాత షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.

Exit mobile version