Site icon HashtagU Telugu

Hair Fall: మీకు జుట్టు బాగా ఊడిపోతుందా ? ఇదే కారణం అవ్వొచ్చు?

Hair Care

Hair Care

Hair Fall: ప్రస్తుత రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య జుట్టు ఊడిపోవడం. మానవ జీవనశైలిలో వచ్చిన ఆహారపు అలవాట్లు కారణంగా ఈ హెయిర్ ఫాల్ సమస్య అన్నది మరింత ఎక్కువవుతుంది. కొంతమంది ఒత్తిడికి గురైనప్పుడు వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. మరికొందరికి తల స్నానం చేసినప్పుడు మరి కొంతమందికి దువ్వెనతో దువ్వినప్పుడు ఇలా అనేక సందర్భాలలో వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. అయితే ఎక్కువ మొత్తంలో ఊడిపోయినప్పుడు చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు.

అయితే చెమట పట్టినప్పుడు కొంతమందికి ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. మరి అటువంటి అప్పుడు ఎటువంటి చిట్కాలను పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎండాకాలం తల నుంచి కాలి గోటి వరకు కూడా చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. అయితే తలకు చెమట పట్టడం అన్నది మీ జుట్టు పై ప్రధానంగా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆయిల్ మసాజ్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. తలకు క్రమం తప్పకుండా మసాజ్ చేస్తూ ఉండాలి.

దీని వల్ల హెయిర్ ఫోలికల్స్ సరిగ్గా ఉండి రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. తలపై ఎక్కువగా చెమట పట్టే ఇప్పుడు జుట్టును బిగుతుగా వేసుకోకూడదు. ఈ సమస్య ఉన్నవారు వీలైనంతవరకు ఎక్కువగా తలకు ఆవిరిని పట్టండి. ఇది తలకు చెమట పట్టించడం వంటి సమస్య నుంచి కాపాడటం మాత్రమే కాకుండా జుట్టు డ్యామేజ్ కాకుండా చేస్తుంది. అలాగే మీ జుట్టును క్రమం తప్పకుండా బ్రష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది చెమట పట్టడాన్ని తగ్గించి జుట్టు రాలడాన్ని మరింత తగ్గిస్తుంది. వెంట్రుకలు పెరిగే కొద్దీ వెంట్రుకల కుదుళ్లు సరిగ్గా ఉంటాయి.