Site icon HashtagU Telugu

Hair Tips: ఈ విధంగా చేస్తే చాలు.. వద్దన్నా జుట్టు పెరగాల్సిందే!

Winter Hair Care Tips

Winter Hair Care Tips

ప్రతి ఒక్కరికి నల్లటి ఒత్తైనా పొడవైన జుట్టు కావాలని కోరుతూ ఉంటారు. అందుకోసం రకరకాల హెయిర్ ఆయిల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ చాలామందికి మంచి ఫలితాలు కనిపించకపోగా జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ కి అనేక రకాల కారణాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒత్తిడి శుభ్రంగా లేకపోవడం సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం ఇలా చాలా రకాల కారణాల వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అన్న విషయానికొస్తే..

లావెండర్ ఆయిల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ లావెండర్ ఆయిల్ జుట్టును పెంచడానికి, చుండ్రును తొలగించడానికి, నెత్తిమీద దురద, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం లావెండర్ ఆయిల్ ను జుట్టుకు అప్లై చేసి 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలట. అదేవిధంగా కర్పూరం తులసినూనె మన జుట్టుకు ఎంతో బాగా ఉపయోగపడతాయట. ఇవి రెండు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయట. వెంట్రుకలు పొడుగ్గా పెరిగేందుకు సహాయపడుతుందట. ఇందుకోసం కర్పూరం తులసి నూనెను జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయాలి.

15 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే హెయిర్ ఫాల్ సమస్య ఆగిపోయి జుట్టు పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే కలబంద జెల్ లో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. ఇది చుండ్రును పోగొట్టడంతో పాటుగా జుట్టు బాగా పెరిగేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం అలోవెరా జెల్ ను తలకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలట. అదేవిధంగా మెంతులు జుట్టు పెరిగేందుకు కూడా సహాయపడతాయి. ఇందుకోసం మెంతులను ముందు రోజు రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వీటిని పేస్ట్ చేసీ ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఉల్లి రసం కూడా జుట్టును పెంచడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందట.