Site icon HashtagU Telugu

Hair Care: ఉల్లిపాయతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టండిలా.?

Hair Care Tips

Hair Care Tips

మన వంటింట్లో విరివిగా దొరికే ఉల్లిపాయ వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఉల్లిపాయ లేనిదే ఏ కూర కూడా పూర్తి అవ్వదు. ఈ ఉల్లిపాయల్లో సల్ఫర్, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఉల్లిపాయల్లో విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం పీచు ఉన్నందువల్ల శరీరానికి పుష్టినిస్తుంది. ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోగపడతాయి.

ముఖంపై ఏర్పడే మచ్చలు,అలాగే కంటి కింద ఏర్పడే నల్లటి వలయాలు, పింపుల్స్ కూడా తగ్గుతాయి. ఉల్లిపాయ చర్మం పొడి పాడటం, వృద్ధాప్య చాలు రావటం, చర్మ ముడతలు పడటం వంటి సమస్యలను నివారించి చర్మాని ప్రకాశవంతంగా చేస్తుంది. అలాగే ఉల్లిపాయ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. వీటితో పాటుగా జుట్టు సమస్యతో బాధపడుతున్న వారికి ఉల్లిపాయ ఒకటి చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఉల్లిపాయల్లో ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి.

ఇవి తలలో ఉండే ఫంగస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడుతాయి. ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలగా పనిచేస్తుంది. జుట్టుకు ఉల్లిపాయ కండిషనర్ గా ఉపయోగపడుతుంది. వెంట్రుకలు రాలకుండా చేస్తుంది. చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. మరి ముఖ్యంగా తొందరగా తెల్ల జుట్టు రాకుండా చేయడంలో ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది.