Site icon HashtagU Telugu

Hair Care: సమ్మర్ లో జుట్టు సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఇలా చేయండి!

Hair Care

Hair Care

వేసవి కాలం వచ్చింది అంటే చాలు చర్మానికి సంబంధించిన సమస్యలతో పాటు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. విపరీతమైన చెమట కారణంగా తల వెంట్రుకలు భాగం నుంచి కూడా చెమట వచ్చి హెయిర్ ఫాల్ సమస్య కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో తలపై ఉండే అదనపు నూనెను, మృత కణాలను తొలగించడంలో సహాయపడే సరైన హెయిర్ కేర్ టిప్స్ అనుసరించాలట. ఈ కణాలు క్లియర్ కాకపోతే అవి వెంట్రుకల కుదుళ్లను మూసుకుపోయేలా చేసి,తలకు తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తాయట. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, జుట్టు రాలడం, ఇతర తలకు సంబంధించిన సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

జిడ్డు తల చర్మం ఉండకూడదు అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి అన్న విషయానికి వస్తే.. క్లెన్సింగ్, టోనింగ్ అనుసరించాలట. అలాగే జిడ్డుగల చర్మం త్వరగా మురికిగా మారుతుంది కాబట్టి, తరచుగా తలస్నానం చేయడం అవసరం అని చెబుతున్నారు. తేలికపాటి, సహజ పదార్థాలు అధికంగా ఉండే షాంపూని ఉపయోగించాలట. అలాగే తల మసాజ్ కూడా చాలా ముఖ్యం. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు మూలాలను పోషిస్తుందట. జిడ్డు జుట్టు ఉన్నవారు టోనింగ్ లోషన్‌తో తేలికగా మసాజ్ చేసి 2 నిమిషాలు బ్రష్ చేయడం, స్ట్రోకింగ్ చేయడం, దువ్వడం వంటివి చేయాలట.

క్లెన్సింగ్ ప్యాక్ విధానం.. ఈ హెయిర్ ప్యాక్ కోసం కొన్ని పెసలు,మెంతులు వేసి పొడి చేసుకొని దానికి 2 భాగాలు శికాకాయ పొడి, 1 భాగం పచ్చి శనగ పొడి,సగం భాగం మెంతుల పొడి కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని నీటితో కలిపి పేస్ట్ లాగా తయారు చేసి జుట్టు, తలపై అప్లై రాయాలి. 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ జుట్టును లోతుగా శుభ్రపరుస్తుందట.

సహజ షాంపూ విధానం.. ఎండిన కుంకుడు కాయలను రాత్రంతా నీటిలో నానబెట్టాలట. ఉదయం, వాటిని మెత్తగా చేసి, నురుగు నీటిని తీయాలట. దీనికి 1 టీస్పూన్ షీకాకై పొడి వేసి, ఈ మిశ్రమంతో మీ జుట్టును కడగాలని చెబుతున్నారు.

షాంపూ ఇన్ఫ్యూషన్ విధానం.. 1.5 గ్లాసుల నీటిలో రెండు గుప్పెళ్ల పుదీనా వేసి 20 నిమిషాలు మరిగించాలట. దీన్ని ఫిల్టర్ చేసి 300 మి.లీ షాంపూ బాటిల్‌ లో కలపాలట. మీరు ఇంట్లో షాంపూ తయారు చేయలేకపోతే, ఈ మిశ్రమాన్ని మీ షాంపూతో కలిపి ఉపయోగించాలని చెబుతున్నారు.

Exit mobile version