Apply Oil: జుట్టు ఆరోగ్యంగా ఈ ఒత్తుగా పెరగాలి అంటే తరచుగా మనం తలకు నూనె రాసుకోవడం తప్పనిసరి. తలకు నూనె రాయడం వల్ల ప్రశాంతంగా అనిపించడంతోపాటు జుట్టు కుదుళ్లు కూడా బలపడతాయి. అయితే జుట్టుకు నూనె రాయడం మంచిదే కానీ కొంతమంది తెలిసి తెలియక ఈ విషయంలో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. కాగా తలకు నూనె రాయడం మంచిదే కానీ ఎన్ని రోజులకు ఒకసారి రాయాలి? ప్రతిరోజు తలకు ఆయిల్ రాస్తే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిపుణుల ప్రకారం జుట్టుకు వారానికి 1 నుంచి 2 సార్లు ఆయిల్ రాయడం మంచిదట.
సాధారణ లేదా డ్రై హెయిర్ ఉన్నవారు వారానికి రెండు సార్లు రాసుకోవచ్చని, ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారు వారానికి ఒకసారి జుట్టుకు నూనె రాస్తే సరిపోతుందని చెబుతున్నారు. దానివల్ల స్కాల్ప్ ఉత్పత్తి చేసే సహజ నూనెలపై చెడు ప్రభావం పడదట. చాలామంది రోజూ నూనె రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుందని అనుకుంటారు. కానీ దానివల్ల హెయిర్ ఫోలికల్స్ బలహీనపడే అవకాశం ఉందట. అంతేకాదు దుమ్ము, ధూళి వంటివి తలపై చేరి చర్మ రంధ్రాలు మూసుకుపోతాయట. ఫలితంగా చుండ్రు, ఇర్రిటేషన్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. ఆయిల్ వాడటం వల్ల జుట్టుకు హైడ్రేషన్ లభిస్తుందట. తలపై స్మూత్ గా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుందని, అయితే చాలామంది నూనెను కొద్దిగా వేడి చేసి జుట్టుకు అప్లై చేస్తుంటారు.
గోరువెచ్చని నూనెతో తలపై మసాజ్ చేస్తే జుట్టులోకి సులభంగా ఇమిడిపోతుందట. అలాగే రక్తప్రసరణ కూడా మెరగవుతుందట. కానీ నూనెను ఎక్కువ వేడి చేయడం మంచిది కాదని, అదే విధంగా జుట్టుపై బలంగా రుద్దడం కూడా ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. జుట్టుకు నూనె రాసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉంచకూడదట. 45 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉంచితే సరిపోతుందని, దానికంటే ఎక్కువసేపు ఉంచితే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. జుట్టుకు నూనె అప్లై చేసేవారు జుట్టు రకాన్ని బట్టి నూనెను ఎంచుకోవాలట. పొడి జుట్టుకు కొబ్బరి నూనె వాడవచ్చని, కొబ్బరినూనె జుట్టు లోపలి వరకు చొచ్చుకుపోయే గుణాలను కలిగి ఉంటుందని, అలాగే మందపాటి జుట్టుకు బాదం నూనె, జుట్టు పెరుగుదలకు ఆముదం నూనె వంటివి వాడవచ్చు అని చెబుతున్నారు.
Apply Oil: ప్రతిరోజు జుట్టుకు నూనె రాయకూడదా.. ఎన్ని రోజులకు ఒకసారి అప్లై చేయాలో తెలుసా?
Apply Oil: తరచుగా జుట్టుకు నూనె అప్లై చేసేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Apply Oil
Last Updated: 10 Dec 2025, 08:04 AM IST