Site icon HashtagU Telugu

Hair Problems: జుట్టు సమస్యలను భరించలేకపోతున్నారా.. అయితే మందారంతో ఈ విధంగా చేయాల్సిందే?

Mixcollage 20 Feb 2024 09 47 Pm 2644

Mixcollage 20 Feb 2024 09 47 Pm 2644

ఈ రోజుల్లో చాలామంది జుట్టుకు సంబంధించిన ఆమెకు రకాల సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చుండ్రు హెయిర్ ఫాల్ అవ్వడం పొట్టి జుట్టు జుట్టు చిట్లిపోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ జుట్టుకు సంబంధించిన సమస్యలు కొన్ని కొన్ని సార్లు తీవ్రం అయి ఆరోగ్యం అందంపై కూడా ప్రభావం చూపిస్తాయి. అయితే మీరు అదనపు జాగ్రత్తలు, శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఈ సీజన్‌లో జుట్టు రాలిపోకుండా తగుచర్యలు తీసుకోవచ్చు. వర్షాకాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో చాలా మంది తడుస్తుంటారు. అయితే అలాంటి వారు ముఖ్యంగా వర్షంలో తడిసే అమ్మాయిలు జుట్టు విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. జట్టు రాలే సమస్యకు ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది.

ఉల్లిరసంలోని యాంటిబాక్టీరియల్‌ గుణాలు తలలోని బాక్టీరియా, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అందుకే ఉల్లిపాయను ముక్కలుగా కోసి వాటిని నుంచి వచ్చే రసాన్ని దూదితో మీ జుట్టుపై అప్లై చేయాలి. ఇలా 30-50 నిమిషాల పాటు ఉంచుకోవాలి. అనంతరం మీ జుట్టును నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం మీ జుట్టు పలుచబడకుండా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లకు రక్తం బాగా సరఫరా అయ్యేలా చేస్తుంది. అలాగే మందార ఆకులు, మందార పువ్వులను గ్రైండ్ చేసి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ మాడుకు, జుట్టుకు అప్లై చేసి ఒక గంట సేపు ఉంచాలి. అనంతరం గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. కలబంద నుంచి గుజ్జు తీసి దానిని మీ మాడుకు పట్టించాలి. ఒక గంట లేదా రెండు గంటలు ఇలా ఉంచాలి. అనంతరం గోరువెచ్చని నీటితో తలను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అలాగే తలస్నానం చేసేముందు కొబ్బరి నూనెను గోరువెచ్చగా కాచి తలకు రుద్దుకుని మర్దనా చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల తలకు బాగా రక్తప్రసరణ జరిగి కుదుళ్లు గట్టిపడతాయి. గోరింటాకు చేతికి పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో జుట్టుకు పెట్టుకుంటే శిరోజాలకు అంత ఆరోగ్యం కూడా ఉంటుంది. గోరింటాకు బాగా నూరి దాన్ని తలకు అద్దుకుని ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే కూడా ఫలితం కనిపిస్తుంది. జుట్టు రాలే సమస్యకు వేప మంచి ఫలితాన్ని ఇస్తుంది. వేప నూనెను తలకు రాసుకుంటే జట్టు రాలే సమస్యతో పాటు ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు ఉన్నా తగ్గుతాయి. అదే విధంగా వేపాకు కూడా బాగా నూరి పేస్ట్ లా తయారు చేసి దాన్ని తలకు పట్టించినా జుట్టు సమస్యలు తీరిపోతాయి.