ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలడం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. జుట్టు రాలడం అరికట్టడం కోసం చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ హెయిర్ ఫాల్ మాత్రం ఆగదు. ఒత్తైనా పొడవాటి జుట్టు కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా హెయిర్ ఫాల్ ఆగదు అలాగే జుట్టు కూడా సరిగా మొలవదు. అయితే జుట్టు కోసం చాలామందికి వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. అయినా కూడా ఇలాంటి ఫలితాలు లభించవు. తల దువ్వుకున్న ప్రతిసారి వెంట్రుకలు కుప్పలు కుప్పలుగా రాలిపోతూ ఉంటాయి. జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు, షాంపూలను ఉపయోగిస్తున్నారు. పార్లర్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. ఏం చేసినా, ఎన్ని రకాల ప్రొడక్టులు ఉపయోగించినా ఆశించిన ఫలితం కనిపించడం లేదని నిరాశ పడుతున్నారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పినట్టుగా చేయాల్సింది అంటున్నారు నిపుణులు. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ప్రతి రోజూ ఒక చోట ప్రశాంతంగా కూర్చుని 5 నిమిషాల పాటు తలకు చక్కగా మసాజ్ చేసుకోవాలట. ఇందుకోసం మీరు కొబ్బరి నూనె, ఆలోవెరా జుల్, ఆర్గాన్ ఆయిల్ వంటి మీకు నచ్చిన ఏదైనా నూనెను ఉపయోగించవచ్చని చెబుతున్నారు. అలాగే రోజూ తలకు నూనె రాసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే వట్టి చేతులతో కూడా మర్దనా చేసుకోవచ్చట. మసాజ్ చేసే సమయంలో కుదుళ్ల మీద ఒత్తిడి పడకుండా మృదువుగా రెండు చేతులతో చేయాలట. ఇలా ప్రతి రోజూ 5 నిమిషాల పాటు తలకు మసాజ్ చేసుకోవడం వల్ల తలపై రక్తప్రసరణ పెరుగుతుందట. ఫలితంగా జుట్టు మొలవడం కూడా మొదలవుతుందని చెబుతున్నారు..
హెయిర్ ట్యాపింగ్.. ఇది చాలా పాత పద్దతి అయినప్పటికీ జుట్టు సమస్యలను నయం చేయడంలో ఎంతో బాగా పనిచేస్తుందట. ప్రతి రోజూ అయిదు నిమిషాల పాటు రెండు చేతులతో మృదువుగా మీ తలను కొట్టుకోవాలట. ఇలా తలంతా సున్నితంగా ట్యాప్ చేసుకోవడం వల్ల తలకు, వెంట్రుకల కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరుగుతుందట. వెంట్రుకల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు సరిగ్గా అంది జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా ఎదుగుతుందట. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందని, అలాగే జుట్టు కూడా మొలవడం మొదలవుతుందని చెబుతున్నారు.
సాధారణంగా మనం తలను నిటారుగా పెట్టుకుని దువ్వుకుంటాం. అలా కాకుండా తలను పూర్తిగా వంచి ఉంచి, వెంట్రుకలన్నింటినీ నేలవైపుకు వేలాడదీసి, దువ్వెనను తల వెనుక నుంచి ముందుకు అంటూ ఉండాలట. దీన్నే బ్యాక్ కోంబింగ్ అంటారట. రోజుకు ఒకసారి ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు చాలా సున్నితంగా బ్యాక్ కోంబింగ్ చేయడం అలవాటు చేసుకోవాలని, చాలా అంటే చాలా సున్నితంగా చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇలా సున్నితంగా బ్యాక్ కోంబింగ్ చేయడం వల్ల జుట్టు చాలా ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుందట.
ప్రాణ ముద్ర లేదా పృథ్వీ ముద్ర.. ఈ రెండింటిలో ఏదో ఒక యోగాసనాన్ని మీరు ప్రతి రోజూ చేయడం అలవాటు చేసుకోవాలట. ఇవి శరీరంలో జీవి శక్తిని, రక్తప్రసరణను పెంచుతాయట. అలాగే జుట్టు ఎదుగుదలకు, ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు అందేలా చేస్తాయని చెబుతున్నారు. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మృదువైన బలమైన వెంట్రులకను మీ సొంతం చేస్తాయట. ఈ ముద్రలను చేయడం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గి ప్రశాంతంగా అనిపిస్తుందని చెబుతున్నారు.