Site icon HashtagU Telugu

Gutti Vankaya Biriyani : వెజిటేరియన్స్ కోసం గుత్తివంకాయ బిర్యానీ.. పక్కా కొలతలతో చేస్తే లొట్టలేసుకుంటూ తినేస్తారు

Gutti Vankaya Biriyani

Gutti Vankaya Biriyani

Vankaya Biriyani : వెదర్ కూల్ గా ఉన్నా.. హాట్ గా ఉన్నా.. బిర్యానీ లవర్స్ కు ఆ పేరు చెబితే నోటిలో లాలాజలం ఊరుతుంది. ఎగ్ మొదలు.. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, ఫిష్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, గోంగూర బిర్యానీ ఇలా చాలా బిర్యానీలే ఉన్నాయి. అలాగే గుత్తి వంకాయతో బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా ? స్పెషల్ గా వెజిటేరియన్స్ కోసం ఈ రెసిపీ పరిచయం చేస్తున్నాం. పక్కా కొలతలతో చేశారంటే లొట్టలేసుకుంటూ తింటారు.

గుత్తివంకాయ బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు

గుత్తి వంకాయలు – 6

బాసుమతి బియ్యం – 2 కప్పులు

ఉప్పు – రుచికి సరిపడా

కారం – 2 స్పూన్లు

పసుపు -1/2 స్పూన్

గరం మసాలా – 1/2 స్పూన్

జీలకర్ర – 1 స్పూన్

ధనియాలు – 1.1/2 స్పూన్

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1.1/2 స్పూన్

నిమ్మరసం – 2 స్పూన్లు

పుదీనా – 1/2 కప్పు

కొత్తిమీర తరుగు – 1/2 కప్పు

పెరుగు – 1/2 కప్పు

లవంగాలు – 5

యాలకులు -3

షాజీరా – 1/2 స్పూన్

దాల్చిన చెక్క – 2 ముక్కలు

బిర్యానీ ఆకులు – 2

ఉల్లిపాయలు – 2

వంకాయ బిర్యానీ తయారీ విధానం

ముందుగా బాసుమతి బియ్యాన్ని కడిగి అరగంటపాటు నానబెట్టాలి. వంకాయలను నిలువుగా నాలుగు ముక్కలుగా చీల్చుకుని.. స్టవ్ పై కళాయిపెట్టి నూనెను వేడి చేసి.. సన్నని మంటపై ఒక్కొక్కటిగా రంగుమారేంత వరకూ వేయించాలి. అదే నూనెలో సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయలను డీప్ ఫ్రై చేయాలి.

ఇప్పుడు మరో గిన్నె తీసుకుని.. ముందుగా వేయించిన వంకాయలను తీసుకుని.. పైన చెప్పిన క్వాంటిటీలో పెరుగు, కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, ఉల్లిపాయ తరుగు వేసి కలుపుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి.. 20 నిమిషాల పాటు మ్యారినేట్ అవ్వనివ్వాలి.

స్టవ్ పై గిన్నె పెట్టుకుని.. అందులో అన్నం వండటానికి నీళ్లుపోసి.. ఉప్పు, నూనె, యాలకులు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు వేసి నీళ్లు మరుగుతుండగా.. బాసుమతి బియ్యం వేసి 70 శాతం ఉడకబెట్టుకోవాలి. నీటిని వంపేసి అన్నాన్ని ఒకప్లేట్ లో ఆరబెట్టుకోవాలి.

మందపాటి గిన్నెను స్టవ్ పై పెట్టి.. మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి కాసిన్ని నీటిని చిలకరించాలి. వండుకున్న అన్నాన్ని పొరలు పొరలుగా వేస్తు.. వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని చల్లుకోవాలి. పైన పుదీనా, కొత్తిమీరల తరుగు వేసుకోవాలి. పైన మూతపెట్టి ఉంచి ఒక 15 నిమిషాలు సన్నని మంటపై ఉడికించుకోవాలి. అంతే.. నోరూరించే.. షుమషుమలాడే వంకాయ బిర్యానీ రెడీ. ఇంటిల్లిపాది కడుపునిండా తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ట్రై చేయండి.