Gummadikaya Vadiyalu: బూడిద గుమ్మడికాయతో వడియాలు ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగలదు!

  • Written By:
  • Publish Date - March 7, 2024 / 06:16 PM IST

వడియాలు అనగానే చాలామందికి బియ్యప్పిండి వడియాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అయితే కేవలం బియ్యప్పిండి వడియాలు మాత్రమే కాకుండా మార్కెట్లో మనకు ఎన్నో రకాల వడియాలు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి వాటిలో గుమ్మడికాయ వడియాలు కూడా ఒకటి. మరి ఈ ఉమ్మడికాయ వడియాలను ఎలా చేసుకోవాలి. అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

బూడిద గుమ్మడి కాయ – ఒకటి
పసుపు – రెండు టీస్పూన్లు
జీలకర్ర – ఒక టీస్పూను
మినపప్పు – పావు కిలో
ఉప్పు – రుచికి సరిపడా
పచ్చిమిర్చి – ఏడు

తయారీ విధానం :

బూడిద గుమ్మడికాయకు బూడిద లాంటి పొడి బాగా అంటుకుని ఉంటుంది. దాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. పైన తొక్క, గింజలు తీయకుండా అలాగే చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఆ ముక్కలను గిన్నెలో వేసి పైన ఉప్పుడు, పసుపు కలిపి ఒక గంట పాటూ ఊరబెట్టాలి. అందులో నీళ్లు దిగుతాయి. నీరంతా వడకట్టేందుకు ముక్కలన్నీ ఒక వస్త్రంలో చుట్టి పిండాలి. దాని మూటలా కట్టుకోవాలి. ఆ మూటను అలాగే రాత్రంతా ఉంచాలి. మరో పక్క మినప్పప్పును కూడా రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం పచ్చి మిర్చి, జీలకర్ర వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలి. అలాగే మినపప్పును మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో రాత్రి మూట కట్టుకున్న గుమ్మడి వడియాలు, మినపప్పు రుబ్బు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. గుమ్మడి ముక్కలు చాలా మెత్తగా నానిపోతాయి కాబట్టి వాటిని రుబ్బాల్సిన అవసరం లేదు. రుచికి సరిపడా ఉప్పు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఎర్రటి ఎండలో పలుచటి వస్త్రంపై వడియాల్లా పెట్టుకోవాలి. ఇలా రెండు నుండి మూడు రోజల పాటూ ఎండితే చాలా వడియాలు రెడీ.