Site icon HashtagU Telugu

Gummadikaya Halwa: రుచికరమైన గుమ్మడికాయ హల్వాను ఇలా చేస్తే చాలు.. లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

Mixcollage 10 Jan 2024 04 27 Pm 1816

Mixcollage 10 Jan 2024 04 27 Pm 1816

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడే స్వీట్ లో హల్వా కూడా ఒకటి. ఈ హల్వాలో కూడా ఎన్నో రకాల హల్వాలు ఉన్నాయి. క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా, అరటికాయ హల్వా, ఇలా రకరకాల హల్వాలు తయారు చేసుకొని తింటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా గుమ్మడికాయ హల్వాను తిన్నారా. తినకపోతే ఈ సింపుల్ రెమెడీని ఎలా పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గుమ్మడికాయ హల్వాకి కావలసిన పదార్థాలు:-

తీపి గుమ్మడికాయ -1
చెక్కర – అరకేజీ
కోవా – 1 కప్పు
జీరపప్పు – 1/2 కప్పు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి – 1 స్పూను
పాలు – 2 కప్పులు

గుమ్మడికాయ హల్వా తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి గింజలు లెకుండా సన్నగా తురుముకోవాలి. బాణలిలో నెయ్యి వేసి జీర పప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించి తీసేయాలి. అందులోనే తురుము, పాలు పోసి సన్నని మంటపై ఉడికించాలి. తరువాత చక్కెర, కోవా, యాలకుల పొడి వేసి బాగా ఉడికించాలి. దించేముందు వేయించిన జీరప్పప్పులు కూడా వేసి దింపాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ.