మామూలుగా స్వీట్ ఐటమ్స్ లో ఎప్పుడు మనం ఇష్టపడే వాటినే కాకుండా అప్పుడప్పుడు ఏదైనా కొత్తగా కూడా ట్రై చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. డిఫరెంట్ గా ట్రై చేయాలని అనుకున్నప్పటికీ వాటిని ఎలా చేయాలి అందుకు ఏమేం కావాలి అన్న విషయాలు చాలా మందికి తెలియదు. మీరు కూడా అలా ఏదైనా సరికొత్తగా రెస్పీ ట్రై చేయాలని అనుకుంటున్నారా. అయితే ఎంతో టేస్టీగా ఉండే గులాబీ ఖీర్ ని ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోండిలా.
కావాల్సిన పదార్థాలు:
బియ్యం – 2 టేబుల్ స్పూన్స్
పాలు – ఒకటిన్నర్ లీటర్
షుగర్ ఫ్రీ పౌడర్ – రుచికి సరిపడా
నట్స్ – 2 టేబుల్ స్పూన్స్ తరగాలి
యాలకుల పొడి – 1 టీస్పూన్
ఎండిన రోజా పువ్వు రేకులు – 2 టేబుల్ స్పూన్లు
తాజా గులాబీ రేకులు – కొన్ని
తయారీ విధానం :
ఇందుకోసం ముందుగా బియ్యాన్ని బాగా కడిగి పావు గంట సేపు నానబెట్టాలి. తర్వాత స్టౌవ్ వెలిగించి వెడల్పాడి కడాయి తీసుకొని పాలను దానిలో వేసి మరింగించాలి. పాలు మరుగుతున్న సమయంలో బియ్యం వేసి ఉడకనివ్వాలి. అన్నం సగానికిపైగా ఉడికిన తర్వాత దానిలో తరిగి పెట్టుకున్న నట్స్, ఎండిన గులాబీ రేకులు, యాలకులు పొడి వేసి బాగా కలపాలి. ఖీర్ చిక్కగా ఉన్నప్పుడు స్టౌవ్ ఆపేసి దానిలో షుగర్ ఫ్రీ పౌడర్ వేసి బాగా కలపాలి. అంతే వేడి వేడి గులాబ్ ఖీర్ రెడీ. పైన గార్నిష్ కోసం కొన్ని గులాబీ రేకులను చల్లుకుంటే సరి.
