Site icon HashtagU Telugu

Guava Leaves: జామ ఆకులతో అలా చేస్తే చాలు.. ముఖంపై మచ్చలు మాయం?

Guava Leaves Benefits

Guava Leaves

ఈ రోజుల్లో చాలామంది ముఖంపై నల్లటి మచ్చల సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నల్లటి మచ్చల కారణంగా చాలామంది అమ్మాయిలు ముఖాలకు మాస్కులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. నలుగురిలోకి వెళ్లలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ముఖంపై నల్లటి మచ్చలు తొలగించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల కొన్ని కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకొందరు హోమ్ రెమెడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఒకవేళ మిమ్మల్ని నల్లటి మచ్చలు ఇబ్బంది పెడుతుంటే ఇలా చేయాల్సిందే. మరి నల్లటి మచ్చల కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జామ పండ్లు, జామ ఆకుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. జామ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జామ ఆకు ముఖంపై ఉండే నల్లని మచ్చలను తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి జామ ఆకుతో నల్లని మచ్చలను ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం జామ ఆకుని పేస్ట్ లా చేసుకుని దానిని ముఖంపై ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. జామపండు లాగే ఇది మనకి మంచి ప్రయోజనాలను అందిస్తుంది.

ఇందులో కూడా పొటాషియం, ఫోలిక్ యాసిడ్లు ఉంటాయి దీంతో ఇది చర్మం పై బాగా పని చేస్తుంది. జామ ఆకుల్లో చాలా మంచి మెడికల్ గుణాలు ఉంటాయి. వీటి ద్వారా మనకి చాలా చర్మ సమస్యల్ని కూడా పరిష్కరించుకోవచ్చు. జామ ఆకులలోని యాంటి మైక్రోబియల్ లక్షణాలు మనకి లభిస్తుంది. జామ ఆకులలో ఇసో ఫ్లేవనోయిడ్స్, గాలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ ఆసిడ్, కెరోటినాయిడ్స్ వంటివి ఉంటాయి. ఇలా ఇది ఉండడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఇవి మనకి ఫైట్ చేయడానికి బాగా సహాయ పడతాయి.