Site icon HashtagU Telugu

Beard : ఏంటి.. గడ్డాన్ని పెంచుకోవడం వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Mixcollage 25 Jan 2024 02 41 Pm 5048

Mixcollage 25 Jan 2024 02 41 Pm 5048

ప్రస్తుత రోజుల్లో మగవారు ఎక్కువగా గడ్డాన్ని పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్క పురుషుడు కూడా గుబురుగా ఉన్న గడ్డాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొందరికి గడ్డం బాగా వచ్చి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఇంకొందరికి మాత్రం సగం వచ్చి సగం రాక, 25 ఏళ్ళ వయసు వచ్చినా కూడా గడ్డం రక బాధపడుతూ అనేక ఇబ్బందులు పడుతుంటారు. మగవారి అందాన్ని రెట్టింపు చేసే వాటిలో గడ్డం కూడా ఒకటి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక గడ్డం బాగా రావడం కోసం చాలామంది అనేక బ్రీడ్ ఆయిల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లేక బాధపడుతూ ఉంటారు.

ఆ సంగతి పక్కన పెడితే కొద్దిమంది పురుషులు గడ్డం ని పెంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. మీకు తెలుసా గడ్డాన్ని పెంచుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మరి గడ్డం పెంచుకోవడం వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గడ్డం పెంచడం అనేది కొందరికి పాషన్. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం కోసం, మరే దేనికో గడ్డాన్ని పెంచే వాళ్లు చాలామంది ఉంటారు. అయితే గడ్డం పెంచడం వల్ల లాభాలు ఉంటాయని చాలామందికి తెలియదు. గడ్డం పెంచడం వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయి. చాలామందికి చర్మ వ్యాధులు వస్తుంటాయి. అయితే గడ్డం పెంచితే సూర్యడి నుంచి వచ్చే రేడియేషన్ ముఖం మీద నేరుగా పడదు.

గడ్డం ఉండటం వల్ల, గడ్డం మీద పడుతుంది. దీంతో చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే క్లీన్ షేవ్ చేసుకుంటే చర్మం గట్టిగా మారుతుంది. మాయిశ్చరైజేషన్ కోల్పోతుంది. దాని వల్ల ముఖం మీద బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దాని వల్ల మొటిమలు కూడా వస్తాయి. అదే గడ్డం ఉంటే అలాంటి సమస్యలు రావు. ముఖంపై మచ్చలను రాకుండా నివారించవచ్చు. గడ్డం ఉండటం వల్ల సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్, యూవీ కిరణాలను అడ్డుకోవచ్చు. చర్మం మీద డైరెక్ట్ గా సూర్యుడి కిరణాలు పడవు కాబట్టి, యూవీ కిరణాల వల్ల చర్మ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. గొంతు ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే గడ్డాన్ని పెంచుకోవాల్సిందే. గడ్డం ఉంటే శరీరం కూడా వేడిగా తయారవుతుందట. ముఖ్యంగా చలికాలంలో గడ్డం పెంచుకుంటే శరీరాన్ని గడ్డం వెచ్చగా ఉంచుతుందట.

Exit mobile version