Site icon HashtagU Telugu

Female Grooming: ఆఫీసులకు వెళ్లే మహిళలు ఇవి తప్పకుండ పాటించండి

Female Grooming

Female Grooming

Female Grooming: సాధారణంగా ఆఫీసులకు వెళ్లేవారు ఒక్కొక్కరు ఒక్కో మనస్తత్వంతో ఉంటారు. కొందరికి దుస్తులపై ఉన్న శ్రద్ధ పని మీద ఉండదు. మరికొందరు పనిపై చూపించే శ్రద్ద వారు వేసుకునే దుస్తుల్లో చూపించరు. నిజానికి ఈ రెండు అలవాట్లు చేటుకు దారి తీస్తాయి. మనకి ఉద్యోగం ఎంత ముఖ్యమో మన వ్యక్తిగత అలవాట్లు కూడా అంతే ముఖ్యం. కొంతమంది మహిళలు ఆఫీసులకు టిప్ టాప్ గా వెళ్తుంటారు. మరికొందరు మాత్రం కస్టపడి పని చేస్తే చాలులే, పై సోకులు మనకెందుకు అనుకుంటారు.

వృత్తికి అనుగుణంగా దుస్తులు ధరించడం మీ ఇమేజ్ పై సానుకూల ప్రభావం చూపుతుంది. మీరు ఆఫీసుకు సిద్ధమవుతున్నప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి. మీ పనితో పాటు, మీరు కనిపించే విధానం కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. మహిళా ఉద్యోగులు చీర కట్టుకుని ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు చీర వదులుగా ఉండకూడదని గుర్తుంచుకోండి. ఇన్నర్‌వేర్ కూడా ఫిట్‌గా మరియు మ్యాచింగ్‌గా ఉండాలి.మ‌హిళ‌ల‌కు అందం కాన్ఫిడెన్స్‌ను ఇస్తుంది.అలా అని గ్లామర్ ని ప్రదర్శించకూడదు. అందుకే అందం, గ్లామర్ మధ్య దారంలా ఉండే సన్నని గీతను దాటకపోవడమే మంచిది. దుస్తులు కార్యాలయంలో మన గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది.

జుట్టును అందంగా తీర్చిదిద్దుకోవడం కూడా ముఖ్యం. ఆఫీసుకు వెళ్లే ముందు జుట్టుకు ఆయిల్ పెట్టుకోవడం మానేయండి.మరీ ముఖ్యంగా శరీరం నుండి వచ్చే ఆహ్లాదకరమైన సువాసన రోజంతా తాజా అనుభూతిని కలిగిస్తుంది, కాబట్టి ఆఫీసులో కూడా ఈ అనుభూతిని కొనసాగించడానికి మంచి పెర్ఫ్యూమ్ సెలక్షన్ ఫాలో అవ్వండి. బరువైన దుస్తులు, చెవిపోగులు , పొడవాటి నెక్లెస్, బ్రాస్‌లెట్‌లను అవాయిడ్ చేయండి. ఫంక్షన్ లేదా ఈవెంట్ కోసం ఇలా రెడీ అవ్వడం వల్ల నష్టమేమీ లేదు. కానీ మీరు ప్రతిరోజూ ఆఫీసుకు వెళితే తక్కువ బరువున్న ఆభరణాలను ధరిస్తే మంచిది. లైట్ మేకప్ వేసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదు. వేసవి మరియు వర్షాకాలంలో వాటర్ ప్రూఫ్ మేకప్ ఉపయోగించడం ఉత్తమం.

Also Read: Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ ఎవరితో..?

Exit mobile version