Site icon HashtagU Telugu

Green Peas Soya : గ్రీన్ పీస్ సోయా కర్రీ.. ట్రై చేయండిలా?

Mixcollage 27 Dec 2023 04 35 Pm 6146

Mixcollage 27 Dec 2023 04 35 Pm 6146

సాధారణంగా మహిళలు ఎప్పుడూ ఒకే విధమైన వంటలు చేసి బోరింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఏదైనా సరికొత్తగా ట్రై చేయాలని అనుకుంటున్నారు. కానీ ఆ రెసిపీ లను ఎలా చేయాలి? ఏవేవి ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న విషయాలు చాలా మందికి తెలియదు. అయితే మీరు కూడా ఏదైనా సరికొత్తగా రెసిపిని ట్రై చేయాలనుకుంటున్నారా. ఈ సరికొత్త రెసిపీ మీ కోసమే. గ్రీన్ పీస్ సోయా కర్రీని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గ్రీన్ పీస్ సోయా కర్రీకీ కావలసిన పదార్ధాలు:

సోయా గ్రాన్యూల్స్ – ఒక కప్పు
పచ్చిమిర్చి – రెండు
కరివేపాకు – ఒక రెమ్మ
ఉప్పు – సరిపడా
కారం – ఒకటిన్నర స్పూన్
పసుపు – అరస్పూన్
నూనె – తగినంత
కొత్తిమీర – కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్
పచ్చి బటానీలు – ఒక కప్పు
టమాటాలు – రెండు
ఉల్లిపాయ – ఒకటి
గరం మసాలా పొడి – అర టీ స్పూన్
ఆవాలు – కొద్దిగా
శనగపప్పు – కొద్దిగా
జీలకర్ర – కొద్దిగా
మినపప్పు – సరిపడినంత
ఎండు మిర్చి – సరిపడా

తయారీ విధానం :

ముందుగా బఠానీలను కుక్కర్ లో ఉడికించుకోవాలి. తరువాత సోయా గ్రాన్యూల్స్ ను మరిగే నీటిలో వేసి రెండు మూడు నిముషాలు ఉడికించి చల్లారక వడపోసి చల్లని నీళ్ళతో రెండుసార్లు కడిగి నీరు పిండేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్ పెట్టి నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి, కరివేపాకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించి టమాటా ముక్కలు వేయాలి. టమాటా బాగా ఉడికిన తరువాత సోయా గ్రాన్యూల్స్, తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి వేయించాలి. చివరగా ఉడికించిన బఠానీలు, కొత్తిమీర, మసాలా పొడి కూడా వేసి బాగా కలిపి ఒక పది నిముషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేస్తే గ్రీన్ పీస్ సోయా కర్రీ రెడీ.

Exit mobile version