Green Mango Rice: రుచికరమైన పచ్చిమామిడి రైస్.. ఇలా చేస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు?

మామూలుగా మనం మామిడికాయతో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకునే తింటూ ఉంటాం. మామిడికాయ చెట్ని మామిడికాయ పులిహోర మామిడికాయ అన్నం

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 02:15 PM IST

మామూలుగా మనం మామిడికాయతో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకునే తింటూ ఉంటాం. మామిడికాయ చెట్ని మామిడికాయ పులిహోర మామిడికాయ అన్నం, మామిడికాయ ఊరగాయి ఇలా ఎన్నో రకాల రెసిపీలు తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా పచ్చి మామిడికాయ రైస్ తిన్నారా. తినకపోతే ఈ సింపుల్ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పచ్చిమామిడి రైస్ కి కావలసిన పదార్థాలు :

పచ్చి మామిడికాయ – ఒకటి
అన్నం – రెండు కప్పులు
పచ్చిమిర్చి – నాలుగు
శనగపప్పు – ఒక చెంచా
మినప్పప్పు – ఒక చెంచా
జీలకర్ర – అరచెంచా
ఆవాలు – అరచెంచా
కారం – అరచెంచా
వేరుశనగలు – రెండు చెంచాలు
జీడిపప్పులు – పది
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – రెండు చెంచాలు
కరివేపాకు – ఒక రెమ్మ
కొత్తిమీర – కొద్దిగా

పచ్చి మామిడి రైస్ తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా మామిడికాయను చెక్కు తీసి, సన్నగా తురుముకోవాలి. తర్వాత స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. కాగిన తర్వాత జీడిపప్పును, వేరుశనగలను వేర్వేరుగా వేయించి తీసేయాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేయాలి. చిటపటలాడాక శనగపప్పు, మినప్పప్పు వేయాలి. రంగు మారిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. కొద్ది సెకన్ల పాటు వేయించి మామిడి తురుము వేయాలి. పుల్లటి పచ్చివాసన తగ్గేవరకూ వేయించి అన్నం వేయాలి. రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించిన తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. ఒక అయిదు నిమిషాల పాటు వేయించాక జీడిపప్పు కూడా వేసి కలిపి దించేయాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమామిడి రైస్ రెడీ.