Green Egg Masala: గ్రీన్ ఎగ్ మసాలా ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోండిలా?

మామూలుగా మనం గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీ లను తయారు చేసుకొని తింటూ ఉంటాం. ఎగ్ రైస్, ఎగ్ మసాలా కర్రీ, ఎగ్ ఫ్రై, ఎగ్ న్యూడిల్స్, ఎగ్ బిర్యానీ ల

  • Written By:
  • Publish Date - January 14, 2024 / 06:30 PM IST

మామూలుగా మనం గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీ లను తయారు చేసుకొని తింటూ ఉంటాం. ఎగ్ రైస్, ఎగ్ మసాలా కర్రీ, ఎగ్ ఫ్రై, ఎగ్ న్యూడిల్స్, ఎగ్ బిర్యానీ లాంటి ఎన్నో రెసిపీలు తినే ఉంటాము. అయితే ఎప్పుడు తినే రెసిపీలు కాకుండా గుడ్డుతో ఏదైనా సరికొత్తగా రెసిపీ ట్రై చేయాలని అనుకుంటున్నారా. అయితే ఈ సరికొత్త రెసిపీ మీ కోసమే. ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా గ్రీన్ ఎగ్ మసాలా రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గ్రీన్ ఎగ్ మసాలాకు కావాల్సిన పదార్థాలు:

గుడ్లు – 4
అల్లం – కొద్దిగా
వెల్లుల్లి – కొద్దిగా
జీడిపప్పు – 10
మిరపకాయలు-4
పెరుగు – 5 టేబుల్ స్పూన్లు
పుదీనా – కొద్దిగా
కొత్తిమీర – కొద్దిగా
నూనె – కొద్దిగా
జీలకర్ర – అర చెంచా
కరివేపాకు – కొద్దిగా
ఉల్లిపాయ – 1
ధనియా పొడి – 1 టేబుల్ స్పూన్
పసుపు – కొద్దిగా
గరం మసాలా – అర టీస్పూన్
మిరియాల పొడి – అర చెంచా
ఉప్పు – రుచికి సరిపడా

గ్రీన్ ఎగ్ మసాలా తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, పచ్చిమిర్చి, పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలి పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక అందులో జీలకర్ర, కరివేపాకు,ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పేస్టును అందులో వేయాలి. పది నిమిషాల పాటు ఉడించిన తర్వాత అందులో ధనియాల పొడి, పసుపు, గరం మసాలా పొడి, ఉప్పు వేయాలి. అన్నింటిని బాగా కలపాలి. ఒక పది నిమిషాల తర్వాత అందులో ఉడికించిన గుడ్లకు గాట్లు వేసి అందులో వేయాలి. ఇలా మరో 10 నుంచి 15 నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి. నీళ్లన్నీ ఇంకిపోయి నూనె పైకి తేలేవరకు వేయించిన తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే రుచికరమై గ్రీన్ ఎగ్ మసాలా రెడీ.