Green Chilli Chicken: డాబా స్టైల్ గ్రీన్ చిల్లి చికెన్ రెసిపీ ఇంట్లోనే చేసుకోండిలా?

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ మాంసాహార ప్రియుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దాంతో చికెన్ ప్రేమికులు ఎప్పుడు ఒకేవిధమైన వంటలు కాకుండా అప్పు

Published By: HashtagU Telugu Desk
Mixcollage 12 Dec 2023 08 10 Pm 7403

Mixcollage 12 Dec 2023 08 10 Pm 7403

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ మాంసాహార ప్రియుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దాంతో చికెన్ ప్రేమికులు ఎప్పుడు ఒకేవిధమైన వంటలు కాకుండా అప్పుడప్పుడు కాస్త వేరేటిగా ఉండే రెసిపీలను ఇష్టపడుతూ ఉంటారు. అయితే అటువంటి వారి కోసం ఈ రెసిపీ. డాబా స్టైల్ గ్రీన్ చిల్లి చికెన్ రెసిపీ ఇంట్లోనే ఇలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గ్రీన్ చిల్లి చికెన్ కావలసిన పదార్థాలు:

చికెన్ – అర కేజీ
టమోటో పేస్ట్ – 2 స్పూన్లు
ఉల్లిపాయలు – 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1టీ స్పూన్
పచ్చిమిర్చి – 10
మిరియాలు – పావు స్పూన్
లవంగం – 5
చెక్క – అంగుళం ముక్క
యాలకులు – 5
జీలకర్ర – 1స్పూన్
జీలకర్ర పొడి – 1స్పూన్
దనియా పౌడర్ – 1స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
మెంతులు – 1స్పూన్
నూనె – తగినంత
ఉప్పు – సరిపడా

గ్రీన్ చిల్లి చికెన్ తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని ఒక బౌల్ లో వేసి అందులో టమోటో పేస్ట్, జీలకర్ర పొడి, దనియా పౌడర్, ఉప్పు వేసి బాగా కలిపి గంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి. తర్వాత మిక్సీ లో పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు మొంతులు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తరువాత ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత నానబెట్టిన చికెన్ ను అందులో వేసి ఒక పది నిముషాలు కలుపుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలను సరిపడా నీళ్ళు పోసి పది నుంచి పదిహేను నిముషాలు ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమిర తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ చిల్లి చికెన్ రెడీ..

  Last Updated: 12 Dec 2023, 08:11 PM IST