Site icon HashtagU Telugu

Green CHilli Chicken: ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చిల్లి చికెన్ ఇంట్లోనే తయారు చేసుకోండిలా?

Mixcollage 04 Dec 2023 05 13 Pm 6196

Mixcollage 04 Dec 2023 05 13 Pm 6196

మామూలుగా మనం చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలను తినే ఉంటాం. చికెన్ బిర్యాని,చికెన్ 65 చికెన్ కబాబ్, తందూరి చికెన్, చికెన్ లాలీపాప్స్ వంటి రకరకాల రెసిపీలను తినే ఉంటాం. అయితే ఎప్పుడైనా గ్రీన్ చిల్లి చికెన్ ని ట్రై చేశారా. ఒకవేళ తినకపోతే ఇంట్లోనే ఈ గ్రీన్ చిల్లి చికెన్ ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గ్రీన్ చిల్లి చికెన్ కి కావలసిన పదార్థాలు:

చికెన్ – అర కేజీ
టమోటో పేస్ట్ – 2 స్పూన్లు
ఉల్లిపాయలు – 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1టీ స్పూన్
పచ్చిమిర్చి – 10
మిరియాలు – పావు స్పూన్
లవంగాలు – 5
చెక్క – అంగుళం ముక్క
యాలకులు – 5
జీలకర్ర – 1స్పూన్
జీలకర్ర పొడి – 1స్పూన్
దనియా పౌడర్ – 1స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
మెంతులు – 1స్పూన్
నూనె – తగినంత
ఉప్పు – సరిపడా

గ్రీన్ చిల్లి చికెన్ తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని ఒక బౌల్ లో వేసి అందులో టమోటో పేస్ట్, జీలకర్ర పొడి, దనియా పౌడర్, ఉప్పు వేసి బాగా కలిపి గంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి. తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు మొంతులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడిచేసి జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత నానబెట్టిన చికెన్ ను అందులో వేసి ఒక పది నిముషాలు కలుపుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలను సరిపడా నీళ్ళు పోసి పది నుంచి పదిహేను నిముషాలు ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమిర తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చిల్లి చికెన్ రెడీ..

Exit mobile version