Site icon HashtagU Telugu

Gram flour skin care: శనగపిండిలో ఇది మిక్స్ చేసి ముఖానికి అప్లై చేస్తే చాలు.. మొటిమలు రమ్మన్నా రావు?

Mixcollage 19 Jan 2024 05 32 Pm 4874

Mixcollage 19 Jan 2024 05 32 Pm 4874

మామూలుగా ప్రతి ఒక్క అమ్మాయి కూడా మచ్చలేని అందమైన చర్మం కావాలని కోరుతూ ఉంటుంది. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడంతో పాటు, వేలకు వేలు పెట్టి బ్యూటీ ప్రోడక్ట్ లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే మీరు కూడా ముఖంపై మొటిమలు నల్లటి మచ్చలు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే శనగపిండిని ఉపయోగించాల్సిందే. శనగపిండి అందాన్ని పెంచడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. మరి శనగపిండితో ముఖ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ట్యాన్‌ వల్ల ముఖం నిర్జీవంగా, అందవిహీనంగా మారుతుంది. ట్యాన్‌ను తొలగించడానికి నాలుగు టీ స్పూన్ల శనగపిండిలో చిటికెడు పసుపు, కొద్దిగా పెరుగు వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకొని, ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే ట్యాన్‌ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఈ ప్యాక్‌ మీ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. అలాగే ఎక్కువ మంది ఎదుర్కొనే సౌందర్య సమస్య ముఖంపై మొటిమలు. మొటిమలను తగ్గించుకోవడానికి ఏవేవో క్రీమ్‌లు రాస్తూ, ట్రీట్మెంట్స్‌ తీసుకుంటూ ఉంటారు. మీరు మొటిమల కారణంగా ఇబ్బంది పడుతుంటే కాస్త శెనగపిండిని చందనం పేస్ట్‌లో కలుపుకొని మొటిమలపై రాస్తే చాలు ఈ సమస్య తగ్గుతుంది. ఈ మిశ్రమంలో నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

దీనివల్ల ముఖంపై మచ్చలేవైనా ఉంటే తొలగిపోతాయి. అంతే కాకుండా మళ్లీ ముఖంపై మొటిమలు మచ్చలు రమ్మన్నా కూడా రావు. అదేవిధంగా శీతాకాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. అలాంటప్పుడు చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచడానికి కాస్త శెనగపిండిలో మీగడ వేసి పేస్ట్‌లాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు రాసుకుని కాసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చర్మం తేమగా, కాంతివంతంగా మారుతుంది. ఈ మిశ్రమంలో ఆలివ్ నూనె లేదా బాదం నూనెను కూడా కలుపుకోవచ్చు. తాజా మృదువైన చర్మాన్ని సొంతం చేయడంలో శనగపిండి సహాయపడుతుంది. కాస్త శెనగపిండిని తీసుకొని అందులో కొద్దిగా పచ్చి పాలు, కాస్త నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ముఖం కాంతివంతమవడంతో పాటు మృదువుగా మారుతుంది. అలాగే చర్మంపై పడిన దుమ్ము, ధూళి కూడా తొలగిపోయి శుభ్రపడుతుంది. ఈ మిశ్రమంలో పాలకు బదులుగా పెరుగు కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.