Site icon HashtagU Telugu

Gongura Pachiroyyalu Curry: ఎప్పుడైన గోంగూర రొయ్యల కర్రీ తిన్నారా.. అయితే సింపుల్ గా ట్రై చేయండిలా?

Mixcollage 18 Dec 2023 07 52 Pm 713

Mixcollage 18 Dec 2023 07 52 Pm 713

మామూలుగా మనం రొయ్యలతో ఎన్నో రకాల రెసిపీలు తినే ఉంటాం. రొయ్యల వేపుడు, రొయ్యల కర్రీ, రొయ్యల మసాలా కర్రీ, రొయ్యల బిర్యానీ లాంటివి తినే ఉంటాం. అలాగే గోంగూరతో కూడా మనం ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేసే ఉంటాం. గోంగూర పప్పు, గోంగూర చట్ని, గోంగూర మటన్ చట్నీ లాంటివి తిని ఉంటాం. అయితే ఎప్పుడైనా మీరు గోంగూర రొయ్యల కర్రీ తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీ ని ఎలా ట్రై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

గోంగూర రొయ్యల కర్రీకి కావలసిన పదార్థాలు:

రొయ్యలు – అర కిలో
గోంగూర – అర కిలో
నూనె – 50 గ్రాములు
పచ్చిమిర్చి – 10
కారం – రెండు స్పూనులు
వెల్లులి – 10 రెబ్బలు
కరివేపాకు – సరిపడా
ఎండుమిర్చి – 5
ఉల్లిపాయలు – 2
ఉప్పు – సరిపడా
ఆవాలు – ఒక స్పూన్
జీలకర్ర – ఒక స్పూన్

గోంగూర రొయ్యల కర్రీ తయారీ విధానం

ఇందుకోసం ముందుగా రొయ్యలు శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.తర్వాత గోంగూర ఆకులు కట్ చేసుకుని కడిగి అందులో పచ్చిరొయ్యలు, ఉల్లిపాయలు, కారం , ఉప్పు,పచ్చిమిర్చి ముక్కలు వేసి నీళ్ళు పోసి ఉడికించాలి. గోంగూర మెత్తగా మగ్గాక దించి నీళ్ళు వార్చేయ్యాలి. తరువాత గిన్నెపెట్టి ఆయిల్ వేసి కాగాకా వెల్లులి, ఎండుమిర్చి, తాలింపు దినుసులు కరివేపాకు వేసి ఉడికించుకున్న గోంగూర పచ్చిరొయ్యలు తాలింపు వేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కర్రీ రెడీ.