Site icon HashtagU Telugu

Gongura Chicken: డాబా స్టైల్ గోంగూర చికెన్ ను ఇంట్లోనే చేసుకోండిలా?

Mixcollage 09 Dec 2023 07 22 Pm 1725

Mixcollage 09 Dec 2023 07 22 Pm 1725

మామూలుగా మనం చికెన్ తో చికెన్ బిర్యాని చికెన్ కర్రీ, తందూరి చికెన్, చికెన్ కబాబ్, చికెన్ రోస్ట్, చికెన్ 65 ఇలా ఎన్నో రకాల వంటలు తయారు చేసుకొని తినే ఉంటాం. వీటిలో కొన్నింటిని మాత్రమే మనం ఇంట్లో తయారు చేసుకొని తింటే మరికొన్ని చికెన్ తో తయారు చేసిన సరికొత్త రెసిపీలను రెస్టారెంట్ హోటల్లో తింటూ ఉంటాం. అటువంటి వాటిలో గోంగూర చికెన్ కూడా ఒకటి. అయితే మీకు కూడా గోంగూర చికెన్ తినాలని అనిపిస్తోందా. మరి డాబా స్టైల్ లో గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గోంగూర చికెన్ కు కావలసిన పదార్థాలు :

చికెన్ – అరకిలో
గోంగూర – రెండు కట్టలు
లవంగాలు – 4
యాలికలు – 2
నూనె – సరిపడా
ఉప్పు – తగినంత
ఉల్లిపాయలు – 2
పచ్చి మిరపకాయలు -3
అల్లం వెల్లుల్లి – 1/2 స్పూను
దాల్చిన చెక్క – 1 ఇంచ్
దనియాలు – 1 టీ స్పూను
జీల కర్ర – 1 టీస్పూన్
కరివేపాకు – కొద్దిగా
పుదినా ఆకులు – కొన్ని
గసగసాలు – 1 టీస్పూను
పసుపు – 1/2 టీ స్పూను
కారము – 1 టీస్పూను

గోంగూర చికెన్ తయారీ విధానం :

ముందుగా గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి ఉడికించి పక్కన పెట్టుకుని చల్లారిన తరువాత మిక్సిలో వేసి పేస్టు లాగా చేసుకోవాలి. తరువాత ఉల్లిపాయలను పేస్టు లాగా చేసుకోవాలి. ఇప్పుడు లవంగాలు, యాలకలు, జీలకర్ర, దాల్చిన చెక్క, దనియాలు, గసగసాలు, మిక్సిలో వేసి పొడి చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని నూనె పోసి ఉల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత చికెన్ వేసి అందులో పసుపు, కారం వేసి రెండు నిముషముల పాటు వేయించాలి. తరువాత మసాలా పొడి వేసి కలిపి గోంగూర పేస్టు కూడా వేసి రెండు నిముషాలు వేగాక పుదినా, కరివేపాకు, ఉప్పు, సరిపడా నీళ్ళు పోసి 5 నిముషముల పాటు ఉడికించాలి. అంటే డాబా స్టైల్ లో ఉండే గోంగూర చికెన్ రెడీ..

Exit mobile version