Site icon HashtagU Telugu

Gold Price: మగువలకు శుభవార్త: బంగారం ధరలు పతనం

Sovereign Gold Bond

Gold Price

Gold Price: గత వారం రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో భారత్‌లోనూ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దసరా, దీపావళి పండుగలు వస్తున్నందున ఎక్కువ మొత్తంలో బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం.

వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర వరుసగా ఆరో రోజు పతనమైంది. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 330 తగ్గింది. దీంతో స్కేలు ధర రూ. 58 వేల 200 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 330 తగ్గింది. 53,335 నడుస్తోంది. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. బంగారం కొనలేని వారు..ఎక్కువగా వెండి ఆభరణాలు కొంటారు. ప్రస్తుతం భాగ్యనగరిలో వెండి ధరలు భారీగా పడిపోయాయి. కిలో రూ. 1500 పడిపోయింది. క్రితం రోజు రూ. 1000 పడిపోయింది. అంటే రెండు రోజుల్లో రూ. 2500 ధర తగ్గింపు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 76 వేలచేరింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.

Also Read: Kasireddy Narayan Reddy : కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి.. రేవంత్ తో కీలక భేటీ