Site icon HashtagU Telugu

Gold Rate Today: సెప్టెంబర్ 2 బంగారం వెండి ధరలు

Gold Rate Today

New Web Story Copy 2023 09 02t112359.748

Gold Rate Today: బంగారం ధరలు తగ్గుముఖం పడతాయని అనుకునేలోపే బంగారం ధరలు మరోసారి షాకిచ్చాయి. ముడి రేటు పరుగులు పెట్టింది. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. బంగారం కొనుగోలు చేసే వారికి ఇది చేదువార్త. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరగడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు పైకి ఎగబాకాయి. సెప్టెంబర్ 2 బంగారం ధరలు పెరిగాయి. ఏపీ, తెలంగాణలోనూ బంగారం ధరలు పెరిగాయి. బంగారం, వెండి ధరలు ఏ మేరకు పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో బంగారం ధర రూ.170 వరకు పెరిగింది.. దీంతో బంగారం ధర రూ. 60,050 నుండి రూ. 60,229 చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారానికి ఈ రేట్లు వర్తిస్తాయి. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. ఈ బంగారం ధర రూ.150కి ఎగబాకింది. దీంతో ముడి రేటు రూ. 55,050 నుండి రూ. 55,200కి చేరింది.

వెండి ధర విషయానికి వస్తే, వెండి ధర రివర్స్ గేర్‌లో ఉంది. బంగారం ధర పెరిగితే, వెండి ధర తగ్గింది. ఇది వెండి కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించే అంశమని చెప్పవచ్చు. నిన్న రూ. 500 పడిపోయింది. అంటే రెండు రోజుల్లో వెండి ధర రూ. 700 తగ్గిందని చెప్పొచ్చు.. ఇదిలా ఉండగా పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను కూడా అదనంగా ఉంటుంది. జీఎస్టీ కూడా చేరితే రేట్లు మరింత పెరగనున్నాయి. ఆభరణాల తయారీ ఛార్జీలు కూడా ఉన్నాయి. ఇవి కూడా కలుపుకుంటే.. ఇక బంగారం ధరలు మరింత పెరుగుతాయి.

Also Read: Neha Shetty: రాధిక హాట్ లుక్స్.. రెడ్ శారీ ధరించి, అందాలు ఒలకబోసి!