గోబీ మంచూరియా(Gobi Manchurian) ఈ మధ్యకాలంలో అందరూ ఎక్కువగా బయట తినే ఫాస్ట్ ఫుడ్స్ లో ఒకటి. దీనికి తొందరగా అట్ట్రాక్ట్ అవుతున్నారు. దీనిని ఎక్కువ ఇష్టంతో తింటున్నారు. క్యాలీ ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, ఆలూ ముక్కలు కలిపి చేసేదే గోబీ మంచూరియా. అయితే దీనిని స్ట్రీట్ ఫుడ్ గా చేసి అమ్మేవాళ్ళు ఎక్కువగా సింథటిక్ రంగులు గోబీ మంచూరియా తయారీలో వాడుతున్నారు అని, దాని తయారీలో ఉపయోగించే సాస్ లో బట్టలు ఉతికే పొడి కలుపుతున్నారని వార్తలు వచ్చాయి.
ఇటీవల గోవా(Gova)లో గోబీ మంచూరియా తయారుచేసే స్టాల్స్ పైన ఆకస్మిక దాడులు జరిగాయి. FDA అధికారులు No Sales బోర్డు పెట్టించారు. గోవా లోని మపుసో, మోర్మోగావ్ నగరాల్లో గోబీ మంచూరియా అమ్మకూడదని, కనిపిస్తే షాప్స్ మూసివేస్తామని ప్రకటించారు. దీంతో గోబీ మంచూరియా బయట తినడం వలన మన ఆరోగ్యానికి మంచిది కాదు అని అధికారులు ప్రకటించారు.
గోవాలో అయినా ఇక్కడ కూడా చాలామంది గోబీ మంచూరియాకు ఆకర్షణీయమైన రంగు కోసం సింథటిక్ రంగులు వాడుతున్నారు. కాబట్టి బయట తినేవారు గోబీ మంచూరియాను తినడాన్ని తగ్గించాలి లేకపోతే మన ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది. అయినా మనం గోబీ మంచూరియా తినాలని అనుకుంటే మన ఇంటిలో తయారుచేసుకోవచ్చు. ఇంటిలో అయితే హానికరమైన కెమికల్స్ కలుపము కాబట్టి దానిని మనం ఇంటిలో చేసుకొని తినడం వలన మనకు ఎటువంటి హాని కలుగదు.
Also Read : Garlic Benefits: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినొచ్చా..? తింటే లాభాలు ఉన్నాయా..?