Site icon HashtagU Telugu

Summer Skin Care: ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు.. కేవలం రెండు వారాల్లో మెరిసిపోయి అందం మీ సొంతం!

Summer Skin Care

Summer Skin Care

వేసవికాలం వచ్చింది అంటే చాలు చాలా రకాల బ్యూటీ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా చర్మం పొడిబారడం, అధిక చెమట కారణంగా చర్మంపై మురికి పేరుకొని నిర్జీవంగా అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటారు. కానీ చాలామంది అవేవీ పట్టించుకోరు. ముఖం, చేతులను జాగ్రత్తగా చూసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇంట్లో నుంచి బయటకు రాకపోతే చర్మానికి ఎలాంటి నష్టం వాటి ల్లుతుందని అంటారు. కానీ నిపుణులు మాత్రం హెచ్చరికలు చేస్తున్నారు. సూర్య రశ్మితో పాటు సీజన్‌ లో ఉండే వేడి కూడా చర్మం పై అధిక ప్రభావం చూపీస్తుందట. ముఖంగా చేతుల చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు మీ చర్మ సంరక్షణ దినచర్యను అనుసరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అందుకోసం కొన్ని హోమ్ రెమెడీలు ఫాలో అవ్వండి అని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పబోయే ఆ హోమ్ రెమిడీలు పాటించడం వల్ల కేవలం 15 రోజుల్లోనే మీ అందంలో మార్పును గమనించవచ్చట.

ముఖ చర్మం విషయంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. 15 రోజుల పాటు ముఖాన్ని నిరంతరం మసాజ్ చేస్తే మెరిసే చర్మాన్ని పొందవచ్చట. ఇందుకోసం పచ్చి కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చట. ఇలా చేయడం వల్ల చర్మం లోపలి నుంచి రిపేర్ చేయబడుతుందని చెబుతున్నారు. దానిలో తేమను నిలుపుకుంటుందట. తోటి చర్మం కూడా మృదువుగా మారుతుందట. కాబట్టి మొదటి 15 రోజులు ప్రతిరోజూ తేలికపాటి చేతులతో ముఖాన్ని మసాజ్ చేయాలని చెబుతున్నారు.

బేసన్ ,యోగర్ట్ ప్యాక్.. ఈ రెండు పదార్ధాలు అటువంటి ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయట. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రకాశించేలా చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తాయట. కావాలంటే వీటితో తయారు చేసిన ప్యాక్‌ ని 15 రోజుల్లో మూడుసార్లు ముఖం,చేతుల చర్మంపై అప్లై చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం ఒక గిన్నెలో 4 నుంచి 5 చెంచాల శెనగపిండిని తీసుకుని దానికి మూడు చెంచాల పెరుగు వేయాలి. అందులో తేనె కూడా కలపవచ్చని చెబుతున్నారు. ఈ పేస్ట్ ముఖంపై ఆరిపోయినప్పుడు, చల్లటి నీటితో మాత్రమే తొలగించాలని చెబుతున్నారు.

అలాగే నీరు ఎక్కువగా తాగాలి. ఇలా చేయడం వల్ల చర్మానికే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయట. మీరు 15 రోజులు మాత్రమే కాకుండా ప్రతిరోజూ సరైన మొత్తంలో నీరు త్రాగాలి. శరీరంలో నీరు సరిగ్గా ఉంటే రక్తం పరిశుభ్రంగా మారుతుందట. దీని వల్ల ముఖం మెరిసిపోతుందట. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు త్రాగాలని, కావాలంటే మీరు రోజుకు కొబ్బరి నీరు కూడా తాగవచ్చని చెబుతున్నారు.