Skin Whitening Facial: చలికాలంలో మీ చర్మం కాంతివంతంగా ఉండాలంటే ఈ ప్యాక్ ట్రై చేయాల్సిందే?

మామూలుగా చలికాలం వచ్చింది అంటే చాలు చర్మం పొడిబారడం నిర్జీవంగా అయిపోవడం పగలడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతో చాలామంది

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 10:00 PM IST

మామూలుగా చలికాలం వచ్చింది అంటే చాలు చర్మం పొడిబారడం నిర్జీవంగా అయిపోవడం పగలడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతో చాలామంది చర్మానికి రకరకాల క్రీములు, వ్యాసిలిన్ వంటివి అప్లై చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది కొబ్బరినూనె వంటివి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అవి కొంతసేపటికి మళ్ళీ డ్రై గా అయిపోతూ ఉంటాయి. దాంతో చర్మం మరింత నిర్జీవంగా ముడతలు పడిపోయి అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చలికాలంలో చర్మం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చాలామంది వాతావరణం చల్లగా ఉండడంతో ప్రతిరోజూ స్నానం చేయరు. శరీరం మురికిగా ఉండటం వల్ల చర్మ సమస్యలు రావడంతో పాటు అనేక సమస్యలు తలెత్తుతాయి.

కానీ అలా చేయకూడదు. కనీసం గోరువెచ్చని నీటితో అయినా స్నానం చేయడం మంచిది. అ సంగతి పక్కన పెడితే చలికాలంలో కూడా మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే ప్యాక్ ట్రై చేయాల్సిందే. మరి ఆ వివరాల్లోకి వెళితే.. పండిన టమోటాలు సగానికి కట్ చేసి, దానిపై ఒక చెంచా పొడి చక్కెరను వేయండి. దీనిపై కొబ్బరి నూనె 7 లేదా 8 చుక్కలు జోడించాలి. దీంతో చర్మాన్ని బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఇది చర్మంలోని మురికి, ధూళిని మొత్తం తొలగిస్తుంది. టమాటాతో ముఖంపై 1 నిమిషం పాటు రుద్దిన తర్వాత, చేతులతో మసాజ్ చేసుకోవాలి. సుమారు 5 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత తడి గుడ్డతో ముఖాన్ని తుడుచుకోవాలి. టమోటాలో మిగిలిన సగం పై తొక్క తొలగించి, దాని రసాన్ని తీసుకోవాలి.

ఒక గిన్నెలో 2 స్పూన్ల టమోటా రసం తీసుకుని, దానిలో 1 చెంచా శనగపిండి, 1 చెంచా బియ్యం పిండి కలుపుకోవాలి. అందులో 1 చెంచా నిమ్మరసం కూడా కలుపుకోవాలి. ఒక స్పూన్‌ సోర్ క్రీం వేసి ఈ మిశ్రమం చర్మానికి అప్లై చేసుకోవాలి
ప్యాక్‌ని ముఖం, చేతులు, పాదాలకు అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చేతులతో తేలికగా రుద్దుకోవాలి. చలికాలంలో స్నానానికి ముందు ఈ ప్యాక్‌ను అప్లై చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత, చర్మానికి సబ్బును అప్లై చేయకూడదు.