Her Story : అమ్మాయిని..అయితేనేం..సర్దుకుపోవాలా..? ఎంతవరకూ..!!

  • Written By:
  • Updated On - November 1, 2022 / 10:34 PM IST

నువ్ అమ్మాయివి…సర్దుకుపోవాలి..అన్ని విషయాల్లో అణిగిమణిగి ఉండాలి. గొంతెత్తి మాట్లాడొద్దు. ఎదురు సమాధానం చెప్పకూడదు. ఈ మాటలన్నీ చిన్నప్పటి నుంచి వేలసార్లు వింటూనే ఉన్నాం. కానీ అలవాట్లు, ఇష్టాలు, చిన్న చిన్న సర్ధుబాట్లు ఇవన్నీ మనకు మామూలే. కానీ ఎంతవరకూ. అమ్మాయిలకు మనస్సు లేదా?. మాట్లాడే శక్తి లేదా? ఎంత కాలం సర్దుకుపోవాలి.?

1. ప్రతిఒక్కరికీ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని స్వీకరించాలి. అలా కాదని భిన్నంగా జీవిస్తామంటే దాన్ని మీరు వ్యతిరేకించడమే మేలు. సర్దుబాటు అనేది మీకు నచ్చకుండా మీరు కొనసాగిస్తూ వస్తే తర్వాతి కాలంలో మీరు మీ ఉనికినే కోల్పోతారు. మీ వ్యక్తిత్వానికి భిన్నంగా ఉండాలనుకుంటే ముందే నిరాకరించడం మంచిది.

2. ఒక్కో విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో నమ్మకం ఉంటుంది. వాటిని ప్రస్తావించే స్వేచ్చ మనలో ఉండాలి. వాటిలో నిర్ణయం మీదే ఉండాలి. ఎదుటివారికి ఛాన్స్ ఇవ్వకూడదు. వాటన్నింటిని నమ్మకూడదంటూ ఒత్తిడి చేసే అవకాశం మీ భాగస్వామికి ఇవ్వకూడదు, ఉండకూడదు.

3. కెరియర్. ఈ విషయంలో రాజీ పడకూదు. మీ కెరియర్ మీ చేతుల్లో ఉండేలా చూసుకోవాలి. ఇల్లు, పిల్లలు, బాధ్యత, ఆలుమగలు. వీటిన్నింటితోపాటు ఒకరికొకరు అండగా ఉంటూ కెరియర్ ను చూసుకోవాలి. అంతేకానీ ఆటంకంగా మారకూడదు.

4. పెళ్లి అయినంత మాత్రాన పాత బంధాలను వదిలేయలేము కదా. మనకంటూ స్నేహితులు, బంధువులు ఉంటారు. వారితో మాట్లాడటానికి అభ్యంతరాలు ఎదురవుతుంటే…దాన్ని ప్రారంభ దశలోనే చర్చించుకోవాలి. అలా బంధాలను తెంచుకుంటూ పోతే చివరకు మీకు ఎవరూ మిగలరు. ఎవరితో స్నేహం చేయాలి…ఎవరితో సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్నది మీ వరకే ఉండాలి. ఈ విషయంలోనూ రాజీపడకూడదు.

5. మీరు ఉద్యోగం చేస్తున్నా, ఇంట్లో ఉంటున్నా…మీ ఆర్థిక విషయాలు మీరే చూసుకోండి. మీకంటూ కొంత పక్కన పెట్టుకోండి. ఖర్చు చేసే ప్రతిసారి భయపడటం, లెక్క చెప్పడం అవతలి వ్యక్తికి మీపై చిన్న చూపే. దాని కొనసాగించే అవకాశం వారికి ఇవ్వకండి.

6. మీకు పాటలు పాడటం ఇష్టమా. అయితే పాడండి. డ్యాన్స్ ఇష్టమా చేయండి. అంతేకానీ అవతలి వారికి ఇబ్బంది కలిగించకూడదు. మీ భాగస్వామికి ఇలాంటివి నచ్చవా. అయితే వాటి కోసం వేరే సమయం కేటాయించండి. అంతేతప్ప మీ ఇష్టయిష్టాలను పక్కన పెట్టాల్సిన పనిలేదు.

అవును అమ్మాయిలం. అయితేనేం గర్వంగా బతుకుతాం. నలుగురిలో ఒకరిగా ఉంటాం.