Diet: అమ్మాయిలు రాత్రి 8 గంటల తర్వాత వీటిని తినండి..పర్ఫెక్ట్ ఫిగర్ మీ సొంతం..!!

అందంగా కనిపించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అందులో అమ్మాయిలు ముందు వరుసలో ఉంటారు. అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 08:58 AM IST

అందంగా కనిపించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అందులో అమ్మాయిలు ముందు వరుసలో ఉంటారు. అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో లభించే ఎన్నో ప్రొడక్టులను వాడుతుంటారు. కానీ అవన్నీ తాత్కాలికం మాత్రమే. కొంతమంది అమ్మాయిలు పర్ఫెక్ట్ ఫిగర్ ను మెయింటెన్ చేసేందుకు డైట్ మేయిన్ టైన్ చేస్తుంటారు. వీటన్నింటిని కారణాలు వేరే ఉండవచ్చు. అధిక బరువుతో బాధపడే మహిళలు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్…రాత్రికి ఉపవాసం చేస్తుంటారు. దీని కారణంగా మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి 8గంటల తర్వాత వీటిని తిన్నట్లయితే అమ్మాయిలు పర్ఫెక్ట్ ఫిగర్ ను సొంతం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి : ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఈ సూపర్ ఫుడ్స్ తినండి.!!

పెరుగు:
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చాలా మంది అమ్మాయిలు రాత్రిపూట పెరుగు తినడం ఆరోగ్యానికి హానికరం అనుకుంటారు. కానీ అది అపోహా మాత్రమే. రాత్రిపూట పెరుగు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. బరువు కూడా తగ్గుతారు. రాత్రి ఎనిమిది గంటల తరువాత మీరు పెరుగు తినండి…కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.

ఆకుపచ్చ కూరగాయలు:
బరువు తగ్గాలనుకుంటే…డిన్నర్ లో ఆకుపచ్చ కూరగాయలు చేర్చుకోండి. వీటి వల్ల అనేక పోషకాలను పొందుతారు. సలాడ్, సూప్ రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. కూరగాయలను పొట్టు తీయకుండా తినడం మంచిది.

అవకాడో :
అవోకాడోను మీ ఆహారంలో చేర్చుకోండి. అవకాడోలో ఉన్న పోషకాలు ఎసిడిటీ, కడుపునొప్పి, అల్సర్లు, పేగులలో మంట మొదలైన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇది కూడా చదవండి: ప్లేట్ లో చికెన్ కు ఈ ఆహారాాలను  చేర్చండి..ప్రొటీన్ కొరత ఉండదు..!! 

తిన్న తర్వాత ఈ పని చేయండి :
– రాత్రి భోజనం చేసిన తర్వాత దాదాపు అరగంట నడవండి.
-ఆహారంలో మసాల దినుసులు తక్కువగా తీసుకోండి. నూనె ఎంత తక్కువ ఉపయోగిస్తే ఆరోగ్యానికి అంత మంచిది. ఇలా చేస్తే పొట్టకు సంబంధించిన సమస్యలు ఉండవు.
– ఆహారం సులభంగా జీర్ణం కావడానికి తక్కువ కార్బ్ ఉన్న ఆహారం తీసుకోవడం అవసరం.