Site icon HashtagU Telugu

Girls don‘t like those Boys: అమ్మాయిలు ఈ ఐదు అలవాట్లు ఉన్న అబ్బాయిలను ఇష్టపడరు..ఎందుకంటే?

Girls Don‘t Like Those Boys

Girls Don‘t Like Those Boys

సాధారణంగా మనుషులకు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అయితే అబ్బాయిలు కొన్ని రకాల క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలను ఇష్టపడితే మరి కొందరు అమ్మాయిలు కొన్ని రకాల క్వాలిటీస్ అబ్బాయిలను ఇష్టపడతారు. కానీ కొంతమంది అమ్మాయిలు కొన్ని రకాల అలవాట్లు ఉన్న అబ్బాయిలను ఇష్టపడరు కాదు కదా కనీసం సరదాపుల్లోకి కూడా రానివ్వరు. మరి అమ్మాయిలు ఎటువంటి అలవాట్లు ఉన్న అబ్బాయిలను ఇష్టపడరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే అప్పుడు అబ్బాయిలు ప్రపోజ్ చేయాలి లవ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు.

అమ్మాయిలు మాత్రం చాలా విషయాలు ఆలోచించడంతోపాటు ఇష్టా ఇష్టాల అభిప్రాయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిల అందం కంటే వారి అలవాటును ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. మరి అమ్మాయిలు ఎటువంటి లక్షణాలను గమనిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా అమ్మాయిలకు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసే అబ్బాయిలు అంటే ఇష్టం ఉండదు. అబ్బాయిలను కనీసం దగ్గరకు కూడా రానివ్వరు. అలాంటి అబ్బాయిలను జులాయి గా భావించడంతోపాటు సమయం సందర్భం బట్టి వారితో ఎలా వ్యవహరించాలి అన్నది కూడా అనుకుంటూ ఉంటారు. సాధారణంగా అబ్బాయిలు, అమ్మాయిల ముందు గొప్పగా కనిపించాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ అటువంటి అలవాట్లు ఉన్న వారిని అమ్మాయిలు ఇష్టపడరు.

అంతేకాకుండా చీటికిమాటికి గొడవపడే అబ్బాయిలు అంటే కూడా అమ్మాయిలకు ఇష్టం ఉండదు. అమ్మాయిలు తమ భద్రత, ఆత్మరక్షణ కోసం పోరాడే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే అమ్మాయిలు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పే అబ్బాయిలను అస్సలు ఇష్టపడరు. అబ్బాయిలు అబద్దాలు చెబుతున్నట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా వెంటనే అలాంటి వారిని దూరంగా పెట్టేస్తూ ఉంటారు. అలాగే అమ్మాయిలపై ఆధిపత్యం చెలాయించే అబ్బాయిలను కూడా వారు అస్సలు ఇష్టపడరు. అర్థం చేసుకుంటూ వారితో ప్రేమగా ఉండే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ప్రతి ఒక విషయంలో అనుమానిస్తూ నెగిటివ్ గా ఆలోచించే అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు. అదేవిధంగా సిగరెట్లు మద్యం లాంటి అలవాట్లు ఉన్న అబ్బాయిలను దూరం ఉంచడంతో పాటు అటువంటి వారితో కలిసి ఉండాలని కూడా కోరుకోరు. అటువంటి అబ్బాయిలను బాధ్యత లేని అబ్బాయిలుగా పరిగణిస్తారు. తాగిన మైకంలో అటువంటి అబ్బాయిలు ఎటువంటి తప్పులు అయినా చేయవచ్చు అన్న భయంతో అమ్మాయిలు అలాంటి వాటిని దూరం పెడతారు.