Ginger Prawns: ఎంతో టేస్టీగా ఉండే జింజర్ ఫ్రాన్స్.. ట్రై చేయండిలా?

మాంసాహార ప్రియులు తక్కువగా తినే వాటిలో రొయ్యలు ముందుగా ఉంటాయని చెప్పవచ్చు. చాలా తక్కువగా మాత్రమే రొయ్యలను తింటూ ఉంటారు. ఈ రొయ్య

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 05:27 PM IST

మాంసాహార ప్రియులు తక్కువగా తినే వాటిలో రొయ్యలు ముందుగా ఉంటాయని చెప్పవచ్చు. చాలా తక్కువగా మాత్రమే రొయ్యలను తింటూ ఉంటారు. ఈ రొయ్యలకు సంబంధించిన రెసిపీలు మనకు ఎక్కువగా పెద్ద పెద్ద రెస్టారెంట్ లలో మాత్రమే దొరుకుతూ ఉంటాయి. ఇక అటువంటి రెసిపీ లలో జింజర్ ఫ్రాన్స్ రెసిపీ కూడా ఒకటి. మరి ఇంట్లోనే ఈ జింజర్ ఫ్యాన్స్ రెసిపీని ఈ విధంగా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జింజర్ ప్రాన్స్ కావలసిన

ప్రాన్స్ – 200 గ్రాములు
మిరియాల పొడి – టీ స్పూన్
కారం – రెండు టీ స్పూన్లు
నూనె – సరిపడా
సోయా సాస్ – టీ స్పూన్
రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు
కొత్తిమీర – కొద్దిగా
ఉల్లిపాయలు – రెండు
అల్లంవెల్లుల్లి పేస్ట్ – అరకప్పు
టొమాటో సాస్ – టీ స్పూన్
అజినమోటో- టీ స్పూన్
ఉప్పు – తగినంత

జింజర్ ప్రాన్స్ తయారీ విధానం :

ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్‌ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్, అజినమోటో, మిరియాలపొడి, కారం, ఉప్పు వేసి వేయించాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసి ఉడికించాలి. నీరు దగ్గర పడేటప్పుడు అందులో టొమాటో సాస్, సోయా సాస్, ఫుడ్ కలర్ వేసి కలిపి ఉడికించిన రొయ్యలను కలిపి తరువాత నూనె లో డీప్ ఫ్రై చేసి వేగిన ప్రాన్స్‌ను సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ జింజర్ ప్రాన్స్ రెడీ.