మామూలుగా అమ్మాయిలు అందమైన పొడవాటి జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే పొడవాటి జుట్టు కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొన్నిసార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా పలుచని జుట్టు, పొట్టి జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే విధంగా నెయ్యిలో కొన్నింటి కలిపి రాస్తే చాలు నల్లగా పొడవుగా పెరగడం ఖాయం అని చెబుతున్నారు. మరి అందుకోసం ఇప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నెయ్యి, కొబ్బరి నూనె ప్యాక్.. కాలుష్యం కారణంగా చాలా మంది జుట్టు మెరుపును కోల్పోతున్నారు. ఒక టీ స్పూన్ నెయ్యితో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె కలిపి, జుట్టుకు అప్లై చేసి కొంత సమయం తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయట.
నెయ్యి మసాజ్.. అలాగే జుట్టు నెరసిపోయే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు వారానికి ఒకసారి కొద్దిగా నెయ్యి తీసుకుని దాన్ని కొద్దిగా వేడి చేసి, ఈ నెయ్యితో మసాజ్ చేయాలట. ఇలా చేస్తే తెల్ల వెంట్రుకల సమస్య తగ్గిపోతుందని చెబుతున్నారు.
జుట్టు మృదుత్వానికి నెయ్యి.. జుట్టును మృదువుగా చేయడానికి, జుట్టులో తేమను నిలుపుకోవడానికి నెయ్యిని ఉపయోగించవచ్చట. దీనిలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయట. ఇది జుట్టుకు పట్టించినప్పుడు జుట్టు మృదువుగా మారుతుందని చెబుతున్నారు.
నెయ్యి, ఉసిరి ప్యాక్.. నెయ్యితో ఉసిరి రసాన్ని కలిపి ప్యాక్ చేయవచ్చట. ఉసిరికాయ ముక్కలుగా కోసి, గ్రైండ్ చేసి రసం తీయాలట. దానికి నెయ్యి కలపాలట. దీన్ని జుట్టుకు పట్టించడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కనిపిస్తాయని చెబుతున్నారు.
నెయ్యి, ఉల్లిపాయ ప్యాక్.. అలాగే నెయ్యితో ఉల్లిపాయ రసాన్ని కలిపి ప్యాక్ చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఇందుకోసం ఉల్లిపాయను ముక్కలుగా కోసి, బ్లెండ్ చేసి రసం తీయాలట. తర్వాత దానికి కొంచెం నెయ్యి కలపాలి. దీన్ని జుట్టుకు పట్టిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయట.
నెయ్యి, బాదం నూనె, నిమ్మరసం ప్యాక్.. నెయ్యి, బాదం నూనె, నిమ్మరసం కలిపి ప్యాక్ కూడా బాగా ఉపయోగపడుతుందట. ఒక గిన్నెలో నెయ్యి తీసుకుని, దానికి బాదం నూనె, నిమ్మరసం కలపి జుట్టుకు పట్టించి వారానికి ఒకసారి ఉపయోగిస్తే జుట్టు సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు.